మహేష్ ట్వీట్.. రౌడీ టీషర్ట్ అన్నీ ఫేక్.. ఇండస్ట్రీపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

Published : Sep 19, 2025, 11:08 AM IST

Bandla Ganesh : ‘లిటిల్ హార్ట్స్’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోని మాఫియా వ్యవస్థలపై కూడా సూటిగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

PREV
16
బండ్ల గణేష్ స్పీచ్ వైరల్

Bandla Ganesh: సినీ నిర్మాత, హాస్య నటుడు బండ్ల గణేష్ ( Bandla Ganesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వేదికలపై చేసే కామెంట్లు ఎంత వైరల్ అవుతాయో.. అంతకంటే చర్చనీయంగా మారుతాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన ఎప్పటిలాగే తన స్పీచ్‌లో పంచ్‌లు, హాస్యం, సీరియస్ ఫాక్ట్స్ కలిపి మాట్లాడి హంగామా చేశాడు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ అంతటా హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే? 

26
లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్

ప్రముఖ యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా శివానీ నాగారం హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కేవలం రూ. 2.5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూప. 40 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లిటిల్ హార్ట్స్’ మూవీ సక్సెస్ మీట్ (Little Hearts Success Meet) జరిగింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా వేడుకకు అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

36
ఈ విజయంతో సిగ్గుతో తలవంచుకోవాలి

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో పెద్ద సినిమాలే హిట్ అవుతాయనుకునే కాలంలో, కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్‌తో తీసిన లిటిల్ హార్ట్స్ దాదాపు రూ..40 కోట్లు వసూలు చేసింది. పెద్ద సినిమాలకు సవాల్ విసిరింది. చిన్న సినిమా చచ్చిపోయిందనుకునే ఇండస్ట్రీకి లిటిల్ హార్ట్స్ బుద్ధి చెప్పింది” అన్నారు. అలాగే, “కథ బాగుంటే, మంచి కంటెంట్ ఉంటే, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఈ సినిమా నిరూపించింది. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు సహా మనందరం ఈ విజయాన్ని చూసి సిగ్గుతో తలవంచుకోవాలి” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

46
హీరో మౌళికి బండ్ల సూచనలు

ఈ సందర్బంగా స్టేజ్ పైకి హీరో మౌళిని పిలిపించిన బండ్ల గణేష్, అతనికి నేరుగా సలహాలు ఇచ్చాడు. "ఈ 20 రోజుల్లో జరిగినంతా అబద్ధం. వాస్తవంలో ఉండు. ఎవరి పొగడ్తలు నమ్మకు. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ ట్వీట్ చేశాడు అని ఫీల్ అవ్వకు. ఇవన్నీ హైప్. మరో శుక్రవారం కొత్త హీరో వస్తాడు, అప్పుడు నిన్ను మరిచిపోతారు" అని స్పష్టం చేశాడు. అలాగే, “చెడు అలవాట్లు చేసుకోకు. మంచి నటుడిగా రాణించు. చంద్రమోహన్ లాంటి కేరెక్టర్ ఆర్టిస్టులు ఎందుకు నిలబడ్డారో నేర్చుకో. ఒక్క సినిమా హిట్ కొట్టిందని స్టార్ అయ్యామనుకోవద్దు. ఫ్లాప్ వస్తే ఎవరూ కాపాడరు” అంటూ హెచ్చరించాడు. ఈ స్పీచ్ యంగ్ హీరో మౌళికే కాదు, కొత్తగా ఎంట్రీ ఇస్తున్న యువ హీరోలందరికీ ఒక పాఠమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

56
ఇండస్ట్రీ మాఫియా పై ఫైర్

బండ్ల గణేష్ ఇండస్ట్రీలోని మాఫియా వ్యవస్థలపై కూడా సూటిగా వ్యాఖ్యలు చేశారు. “ఇండస్ట్రీలో కొన్ని మాఫియా వ్యవస్థలు మనల్ని బ్రతకనివ్వవు. ఎవరో కొంత మంది ప్రివిలెజ్‌తో పుడతారు. స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతాడు, మెగాస్టార్ బావమరిది అవుతాడు. అలాంటి వాళ్ల లైఫ్ ఈజీ. కానీ మిగతా వాళ్లు మాత్రం తమ కష్టంతోనే ఎదగాలి. అదే నిజమైన ప్రయాణం” అని అన్నారు.

66
నిర్మాతలపై ఖర్చుల విమర్శలు

స్పీచ్‌లో భాగంగా బండ్ల గణేష్ నిర్మాతలపై కూడా చురకలు అంటించారు. "రెండున్నర కోట్లతో సినిమా తీసి 50 కోట్లు వసూలు చేస్తే.. పెద్ద నిర్మాతలంతా సిగ్గుతో తలవంచుకోవాలి. వారు ఖర్చు చేసే కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయి. ఒక పెద్ద సినిమా మూడు రోజుల షూటింగ్ కాన్సిల్ అయితేనే రూ. 2.5 కోట్లు వృథా అవుతాయి. అదే డబ్బుతో చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి”అని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరదాగా మాట్లాడిన నిజాలు బయటపెట్టారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories