3 నిమిషాలకు రూ. 6 కోట్లు.. స్పెషల్ సాంగ్ లో రచ్చ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Sep 22, 2025, 11:11 AM IST

Tamannaah Bhatia: తమన్నా భాటియా బాలీవుడ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’లో స్పెషల్ సాంగ్ గఫూర్ కోసం రూ.6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. ఫుల్ వీడియో యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్, గ్లామర్, స్టెప్‌లతో ఆకట్టుకుంటున్నాయి.

PREV
15
స్పెషల్ సాంగ్‌కి షాకింగ్ ఫిగర్

ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అంటే ప్రత్యేకంగా ఒక హీరోయిన్ ఉండేది. వాళ్లను ఐటమ్ క్వీన్ అంటుండేవారు. కానీ కాలం మారింది – ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా ఐటమ్ భామలుగా మారాయి. మొదట బాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో నోటీసబుల్‌గా ఉంది. ఒక్కొ హీరోయిన్ ఒక్కో సాంగ్ కు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ కేవలం 3 నిమిషాల పాటకు ఏకంగా రూ. 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

25
మిల్క్ బ్యూటీ హవా

3 నిమిషాల పాటకే రూ. 6 కోట్ల రెమ్యునరేషన్.. వసూలు చేసి రికార్డ్ సృష్టించిన హీరోయిన్ ఎవరో కాదు. మన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా. ఈ అమ్మడు తన గ్లామర్‌, ఎనర్జీ, స్టైల్‌ అన్నీ కలబోసి డ్యాన్స్ స్టెప్పులతో ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసిన ఈ మిల్కీ బ్యూటీ.. ఓ స్పెషల్ సాంగ్ లో రెచ్చిపోయారు. తన స్టెప్పులతో కుర్రకారును షేక్ చేశారు.

35
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇటీవల ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ తో దర్శకుడిగా డెబ్యూ ఇచ్చారు. ఏడు ఎపిసోడ్ల సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సిరీస్‌లో షారుఖ్ ఖాన్ నుండి దిశా పటానీ వరకు అనేక స్టార్ సెలబ్రిటీలు నటించారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కూడా క్యామియో రోల్ కనిపించారు. ఈ సిరీస్‌లో మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా “గఫూర్” అనే స్పెషల్ సాంగ్ లో మెరిశారు. గ్లింప్స్ రూపంలో ఇప్పటికే విడుదలైన సాంగ్, అభిమానులను ఉర్రూతలూగించింది. ఫుల్ గ్రేస్ తో స్టెప్పులు వేసి, తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించగా, బాలీవుడ్ పాత విలన్లు శక్తి కపూర్, గుల్షన్ గ్రోవర్, రంజిత్ కూడా ఇందులో కనిపించారు.

45
రూ. 6 కోట్ల భారీ రెమ్యునరేషన్!

‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’లో ఇంత హాట్ స్పెషల్ సాంగ్ కోసం తమన్నా ఏకంగా రూ. 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో సమాచారం. కేవలం మూడు నిమిషాల పాటకే ఈ పెద్ద మొత్తాన్ని వసూలు చేయడం పరిశ్రమలో రికార్డు స్థాయి. ఇది ఆమె గత హిట్ సాంగ్స్‌తో పోలిస్తే తమన్నా తీసుకున్న రెమ్యూనరేషన్ హై అనే చెప్పాలి. దీంతో ఒక్కసారిగా ఈ స్పెషల్ సాంగ్ చుట్టూ హాట్ టాపిక్ క్రియేట్ అయింది. ఈ వార్త నెట్టింట్లో వైరల్ కావడంతో “ఒక్కో స్టెప్‌.. తమన్నా దుమ్మురేపింది!”, “గ్లామర్‌తో కట్టిపడేస్తుంది!” అని రియాక్ట్ అవుతున్నారు.

55
తమన్నా రెమ్యూనరేషన్

తమన్నా ఇప్పటికే ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ అనే పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆ తర్వాత ‘రైడ్ 2’లో మరో ఐటమ్ నంబర్‌తో అలరించింది. తాజాగా ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’లో మరింత స్టైల్, గ్లామర్ మిక్స్ చేసి స్టెప్పులు వేసింది. అలాగే.. తమన్నా ఒక సినిమా కోసం ప్రస్తుతం సుమారు రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుంటుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. ఇటీవల ‘ఓదెల్ 2’లో ఆమె భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ‘రైడ్ 2’లోని ‘నషా’ సాంగ్ కోసం రూ. 5 కోట్లు వసూలు చేసిందని ప్రచారం. ‘జైలర్’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ కోసం ఆమెకు రూ. 3 కోట్లు అందినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ అధిగమిస్తూ, కేవలం మూడు నిమిషాల పాటకే ఏకంగా రూ. 6 కోట్లు తీసుకోవడం తమన్నా హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories