ఒకే ఫ్రేములో వెంకటేష్‌, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున, వర్మ.. సంచలన మూవీ సెట్‌లో, ఫోటో వెనుక స్టోరీ

Published : Sep 22, 2025, 10:20 AM IST

ఒకే ఫ్రేములో వెంకటేష్‌, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున, వర్మ ఉన్న అరుదైన ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. బిగ్‌ స్టార్స్ అంతా కలిసి చేయడం ఆకట్టుకుంది. మరి ఈ ఫోటో వెనుక స్టోరీ ఏంటో తెలుసుకుందాం.    

PREV
15
ఒకే ఫ్రేములో చిరు, వెంకీ, శ్రీదేవి, నాగ్‌, వర్మ- అరుదైన ఫోటో

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన గతం విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఫ్యాన్స్ నే కాదు, సాధారణ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటాయి. వారు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. తాజాగా ఒక అరుదైన ఫోటో సోషల్‌ మీడియాలో తారసపడింది. ఇందులో ఒకే ఫ్రేములో దిగ్గజ నటులు ఉండటం విశేషం. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మతోపాటు వెంకటేష్‌, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున కలిసి దిగిన ఈ రేర్‌ పిక్‌ వైరల్‌ అవుతుంది. అయితే ఈ ఫోటో ఏ సినిమా సమయంలో దిగారు?, దీని వెనుక ఉన్న కథేంటి? అనేది తెలుసుకుందాం.

25
వెంకటేష్‌ సినిమా సెట్‌లో చిరు నాగ్‌ సందడి

చిరంజీవి, నాగార్జున మధ్య మంచి స్నేహం ఉంది. ఇది అప్పట్నుంచి కొనసాగుతుంది. అదే సమయంలో వెంకటేష్‌ కూడా చిరంజీవికి ఫ్రెండ్లీగానే ఉంటారు. వీరంతా తరచూ కలుస్తుంటారు. కేవలం పార్టీలకు, ఫంక్షన్లకు కలవడమే కాదు, ఇలా సినిమా సెట్‌లోకి వెళ్లి సడెన్‌ సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. అందులో భాగంగానే వెంకటేష్‌ సినిమా సెట్‌కి చిరంజీవి, నాగార్జున వెల్లడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికీ ఈ మూవీ ఏంటో అర్థమై ఉంటుంది.

35
వెంకటేష్‌, శ్రీదేవి జంటగా `క్షణక్షణం`

వెంకటేష్‌, శ్రీదేవి కలిసి `క్షణక్షణం` సినిమాలో నటించారు. ఇది సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకి డ్రీమ్‌ ప్రాజెక్ట్. ఎందుకంటే తన ఆరాధ్య నటి శ్రీదేవితో కలిసి పనిచేస్తోన్న తొలిసినిమా కావడం. ఆమెని కోరి మరీ ఇందులో నటింపచేశారు వర్మ. ఆమెని ఎలా అయితే చూడాలనుకున్నాడో ఇందులో చూపించారు. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ కంటే అతిలోక సుందరికే ఎక్కువ సీన్లు పెట్టాడు. ఆమెపై అభిమానం, క్రష్‌ని మొత్తం చూపించారు వర్మ. 1991 అక్టోబర్‌ 9న విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది.

45
అందుకే `క్షణక్షణం` సెట్‌కి వచ్చిన స్టార్స్

రామ్‌గోపాల్‌ వర్మ `శివ` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున హీరో. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఇదొక కల్ట్ క్లాసిక్‌గా అంతా అభివర్ణిస్తారు. ఈ మూవీ నాగార్జునకి బిగ్గెస్ట్ బ్రేక్‌ ఇచ్చింది. తిరుగులేని స్టార్‌ని చేసింది. అదే సమయంలో వర్మకి ఈ మూవీతో లైఫ్‌ ఇచ్చారు నాగ్‌. ఆయన్ని నమ్మి చేశారు. ఇలా ఈ మూవీ ఇద్దరికి లైఫ్‌ టర్నింగ్‌ సినిమా అయ్యిందని చెప్పొచ్చు. ఆ పరిచయంతోనే `క్షణక్షణం` షూటింగ్‌ సెట్‌లోకి వచ్చారు నాగార్జున. ఆ సమయంలో `క్షణక్షణం` మూవీ షూటింగ్‌ కి పక్కనే చిరంజీవి సినిమా చిత్రీకరణ జరుగుతుందట, అలా నాగ్‌ ఆహ్వానం మేరకు చిరంజీవి కూడా సెట్‌కి వెళ్లి కాసేపు సందడి చేశారు.

55
`జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీలో చిరు, శ్రీదేవి జోడీ

`క్షణక్షణం` కంటే ముందు ఏడాదే శ్రీదేవి చిరంజీవితో `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమా చేసింది. ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ పరిచయంతో శ్రీదేవిని కలవడానికి వచ్చారు చిరు. పైగా చిరంజీవికి వెంకీ మంచి ఫ్రెండ్‌, అదే సమయంలో నాగ్‌కి బావ కూడా. అలా అంతా `క్షణక్షణం` సెట్‌లో కలిసి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటో వైరల్‌గా మారడం విశేషం. ఇప్పుడు చిరు, వెంకీ, నాగ్‌ టాప్‌ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవి 2018లో దుబాయ్‌లో కన్నుమూసింది. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఫేడౌట్‌ అయ్యారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories