అప్పట్లో ఇలాంటి వాళ్లుంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో : పవన్ కళ్యాణ్

Published : Sep 22, 2025, 09:59 AM IST

Pawan Kalyan : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

PREV
15
ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఓజీ నుంచి విడుదలై టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఆదివారం (సెప్టెంబర్ 21) హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ కన్సర్ట్’( ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌) ను ఘనంగా నిర్వహించారు. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది అభిమానులు అక్కడికక్కడే ఉండి, తమ అభిమాన నటుడిని చూసి హర్షం వ్యక్తం చేశారు.

25
డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయా

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ సినిమాను ఇంతగా ప్రేమిస్తానని నాకు తెలియదు. సుజీత్ మాట్లాడేది తక్కువ, కానీ సినిమాను తెరకెక్కించే విధానం మాత్రం అద్భుతం. ఈ మూవీకే ఎక్కువ క్రెడిట్ ఆయనకే చెందుతుంది. సుజీత్ విజన్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడానికి తమన్ కూడా తోడయ్యాడు. వీరిద్దరూ ఈ సినిమాకు హీరోలు. వీరద్దరూ ఒక ట్రిప్‌ లాగా సినిమా చేశారు. అందులో నన్నూ లాగేశారు. ఈ రోజు నేను డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయా. ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా?” అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

35
రాజకీయాల్లోకి వెళ్లినా మీరు నన్ను వదల్లేదు

అలాగే పవర్ స్టార్ తన కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ ‘ఖుషీ’లో చేసిన ఖటానాను మళ్లీ ప్రాక్టీస్ చేశా. ఆ యాక్షన్ చుట్టూ కథను అల్లారు. ఇందులో ప్రియాంకతో మంచి లవ్ స్టోరీను తీశారు. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు. నేను ‘ఖుషీ’ సమయంలో ఇలాంటిదే జోష్ చూశా. సుజీత్ ఒక అభిమాని‌గా వచ్చి అద్భుతమైన సినిమా తెరపై చూపించబోతున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లినా మీరు నన్ను వదల్లేదు. నేను ఇలా పోరాటం చేస్తున్నానంటే అందుకు కారణం మీరే. సినిమా చేస్తున్నప్పుడు అది తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు” అన్నారు.

45
పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్

డైరెక్టర్ సుజీత్‌ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడుతూ “సుజీత్ నాకు జపనీస్ నేర్పించాడు. సుజీత్‌ లాంటి దర్శకుడు ముందే పరిచయం అయ్యుంటే నేను రాజకీయాల్లోకి వెళ్లేవాడిని కాదు. తెలుగు వాడంటే ఆకాశమే ఉరుముతోంది. అన్నింటినీ అధిగమించి ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మీ అద్భుతంగా నటించారు. భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే శ్రియారెడ్డితో మళ్లీ కలిసి నటిస్తా..” అని తెలిపారు.

55
ఓజీపై హైప్

‘సినిమా చేస్తున్నప్పుడు నాకు వేరే ఆలోచన ఉండదు. మీరే నా బలం. వర్షం మనల్ని ఆపలేదంటే.. ఓటమి కూడా ఆపలేదనే సంగతి గుర్తుంచుకోండి’ అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు పవర్ స్టార్. అలాగే థియేట్రికల్ ట్రైలర్ ఆలస్యంగా వస్తుందన్న కారణంగా, అభిమానుల ఒత్తిడికి లోనైన డైరెక్టర్ సుజీత్‌ ట్రైలర్‌ను చూపించగా.. స్టేడియం అంతా హర్షధ్వనులతో మార్మోగిపోయింది. ఈవెంట్ ప్రారంభమైన దగ్గరినుంచి ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినా, అభిమానులు కదలకుండా తమ అభిమాన నటుడి ప్రసంగాన్ని ఆస్వాదించారు. వేదికపై పవన్ సహా చిత్రబృందం మొత్తం వర్షంలో తడుస్తూ మాట్లాడి అభిమానులను ఉత్సాహపరిచారు. మొత్తానికి ‘ఓజీ’ రిలీజ్‌పై మరింత హైప్ క్రియేట్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories