Tamannaah Bhatia : తమన్నా భలే టాస్క్ ఇచ్చింది... నెటిజన్లు ఏమైనా తక్కువోళ్లా.. దాని గురించే మాట్లాడుతున్నారు

First Published | Feb 24, 2024, 5:57 PM IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా  మిల్క్ బ్యూటీ స్టన్నింగా నెట్టింట దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ కు, నెటిజన్లకు ఫన్నీ టాస్క్ ఇచ్చింది.

టాలీవుడ్ Tollywood  లో కొన్నేళ్లపాటు ఊపూపిన తమన్నా భాటియా ప్రస్తుతం తెలుగులో కాస్తా జోరు తగ్గించింది. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస పెట్టి ప్రాజెక్ట్స్ చేస్తోంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇటు వరుస పెట్టి ప్రాజెక్ట్స్ తో తమన్నా భాటియా బిజీగా ఉన్నప్పటికీ తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పంచుకుంటూ వస్తోంది. మరోవైపు నయా లుక్స్ తోనూ మెస్మరైజ్ చేస్తోంది.


తాజాగా తమన్నా రెడ్ స్ట్రాప్ లెస్ గౌన్ లో కిర్రాక్ గా ఫొటోషూట్ చేసింది. స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూనే తన అభిమానులు, ఫ్యాన్స్ కు ఫన్నీ టాస్క్ అందించింది. 
 

ఇంతకీ ఆ టాస్క్ ఏంటంటే... తమన్నా ధరించిన డ్రెస్ కలర్ ను రెండు నిమిషాలు చూసి చెప్పడానికి ప్రయత్నించండి సూచించింది. మౌనంగా అలాగే చూస్తుంటే అది రెడ్ కలర్ అని గ్రహిస్తారు. 

కానీ వాస్తవానికి తమన్నా వేసుకున్న గౌన్ కలర్ అరెంజ్ అంట.... ఈ విషయాన్ని కూడా మిల్క్ బ్యూటీనే చెప్పుకొచ్చింది. ఏదేమైనా అదిరిపోయే అవుట్ ఫిట్ లో తమన్నా లుక్ అట్రాక్టివ్ గా ఉందని ఫ్యాన్స్ పొగుడుతున్నారు. లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

మరోవైపు నెటిజన్లు మాత్రం మిల్క్ బ్యూటీకి మరోలా షాక్ ఇస్తున్నారు. రెండు నిమిషాలు డ్రెస్ ను చూడటం కష్టమే.. ఎందుకంటే మెరిసిపోతున్న అందం ముందు అది సాధ్యం కాదంటున్నారు. తమన్నా ఫిట్ నెస్, గ్లామర్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తున్నారు. ఇక మిల్క్ బ్యూటీ ‘అరణ్మనై4’, ‘వేదా’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Latest Videos

click me!