Bhuma Mounika: బేబీ బంప్ చూపిస్తూ భూమా మౌనిక ఫోటో షూట్.. మంచు మనోజ్ కామెంట్ చూశారా

First Published | Feb 24, 2024, 5:14 PM IST

మంచు మనోజ్ హీరోగా చేస్తూనే టివి రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఉస్తాద్ షోకి మంచు మనోజ్ బుల్లితెరపై ఉస్తాద్ అనే చాట్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి నాని, సిద్ధూ జొన్నలగడ్డ, అడివి శేష్, రవితేజ లాంటి హీరోలు హాజరయ్యారు.

మంచు మనోజ్ హీరోగా చేస్తూనే టివి రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఉస్తాద్ షోకి మంచు మనోజ్ బుల్లితెరపై ఉస్తాద్ అనే చాట్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి నాని, సిద్ధూ జొన్నలగడ్డ, అడివి శేష్, రవితేజ లాంటి హీరోలు హాజరయ్యారు. మంచు మనోజ్ గతంలో పర్సనల్ లైఫ్ లో కూడా సమస్యలు ఎదుర్కొన్నాడు. గత ఏడాది మంచు మనోజ్.. భూమా మౌనికని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఈ జంట సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అన్యోన్యంగా జీవిస్తూ కొత్త లైఫ్ ని ప్రారంభించారు. మంచు మనోజ్, భూమా మౌనిక వివాహంపై చాలా రూమర్స్ వినిపించాయి. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా మంచు మనోజ్ మౌనికని వివాహం చేసుకుంటున్నాడు అని కామెంట్స్ వినిపించాయి. అయితే మంచు లక్ష్మి దగ్గరుండి మనోజ్ మౌనికలకు వివాహం చేసింది. 


ఇదిలా ఉండగా ప్రస్తుతం భూమా మౌనిక గర్భవతి. త్వరలో మంచు మనోజ్, భూమా మౌనిక తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆ మధ్యన మంచు మనోజ్ తన సతీమణి ప్రెగ్నన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

తాజాగా భూమా మౌనిక బేబీ బంప్ చూపిస్తూ ఫోటో షూట్ చేసింది. బ్యూటిఫుల్ గా ఉన్న ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూమా మౌనిక ఈ ఫొటోస్ కి ఎమోషనల్ కామెంట్స్ పెట్టింది. 

నా లోపల ఇంకొక జీవితం ఉంది. నా తర్వాత కొనసాగే జీవితం అది. మౌనిక పోస్ట్ కి మంచు మనోజ్ క్యూట్ కామెంట్ పెట్టారు. 'పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే' అని కామెంట్ పెట్టాడు. 

భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతుల్లో మరికొన్ని రోజుల్లో తల్లిదండ్రులం కాబోతున్న జోష్ కనిపిస్తోంది. అభిమానులంతా జూనియర్ మంచు మనోజ్ లోడింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Latest Videos

click me!