Tamannaah Bhatia: కేవలం 6 నిమిషాల్లో 6కోట్లు సంపాదించిన మిల్కీ బ్యూటీ..!

Published : Jan 06, 2026, 05:43 PM IST

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా రీసెంట్ గా గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో పాల్గొంది. ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఆమెకు భారీ పారితోషికం అందినట్లు సమాచారం. 

PREV
13
మిల్కీ బ్యూటీ తమన్నా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకి పరిచయం అవసరం లేదు. ఆమె తెలుగులో దాదాపు దశాబ్దానికి పైగా సినిమాలు చేస్తూ వస్తున్నారు.  తెలుగు మాత్రమే కాకుండా కన్నడ, హిందీల్లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసి ఆకట్టుకున్నారు.  ఈ మధ్య ఐటెం సాంగ్స్  చేస్తూ.. అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. 

23
భారీ పారితోషికం..

రీసెంట్ గా తమన్నా గోవాలో జరిగిన ఓ న్యూ ఇయర్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో ఆమె ఒక ఐటెం సాంగ్ చేసినట్లు సమాచారం. కేవలం 6 నిమిషాల పాటకు డ్యాన్స్ చేసిన తమన్నా.. అందుకుగాను ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.

డిసెంబర్ 31 అర్థరాత్రి న్యూఇయర్ వేడుకల్లో భాగంగా ఆమె ఒక బీచ్ లో డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. ఇది ఆన్ లైన్ చాలా వైరల్ అయ్యింది.

33
సెలబ్రిటీల కిక్

గోవాలో జరిగే న్యూ ఇయర్ పార్టీలలో సెలబ్రిటీల ప్రదర్శనలు కొత్తేమీ కాదు. ఇలాంటి కార్యక్రమాలకు పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలుస్తారు. వాళ్లకు కోట్లలో డబ్బు చెల్లిస్తారు. ఈ ఏడాది తమన్నాతో పాటు కొందరు సెలబ్రిటీలను ఆహ్వానించారు. ఇలాంటి సెలబ్రిటీలు డ్యాన్స్ చేయడం మొదలుపెడితే, అక్కడ ఉన్నవారికి మరింత కిక్ వస్తుంది. ఆ కిక్ కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తారు. అందుకే, ఐటమ్ సాంగ్స్ చేసేవారికి కోట్లు ఇచ్చినా నిర్వాహకులకు ఎలాంటి నష్టం ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories