Sushmita konidela కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? చిరంజీవి, పవన్‌ కాదు.. బాబాయ్‌తో మూవీపై క్లారిటీ

Published : Jan 06, 2026, 04:48 PM IST

చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల తన ఫేవరేట్‌ హీరో ఎవరో వెల్లడించింది. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది. `మన శంకరవరప్రసాద్‌ గారు` గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.  

PREV
16
నిర్మాతగా ప్రూవ్‌ చేయబోతున్న చిరంజీవి కూతురు సుస్మిత

మెగా డాటర్‌ సుస్మిత కొణిదెల నిర్మాతగా మారి అటు వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ మూవీస్‌తోపాటు ఇటు బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలు కూడా నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు తండ్రి చిరంజీవి హీరోగా ఆమె `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీని నిర్మిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్ సాహు గారపాటితో కలిసి తన గోల్డ్ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్రంతో నిర్మాతగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సుస్మిత. 

26
సెన్సార్‌ పూర్తి చేసుకున్న `మన శంకరవరప్రసాద్‌ గారు`

తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు /ఏ సర్టిఫికేట్‌ని పొందింది. డీసెంట్‌ నిడివితో మూవీ ఉంటుంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంగళవారం సినిమా గురించి నిర్మాతలు సుస్మిత కొణిదెల, మరో నిర్మాత సాహు గారపాటి ముచ్చటించారు. సినిమాపై నమ్మకాన్ని వెల్లడించారు. బుధవారం గ్రాండ్‌గా ఈవెంట్‌ ప్లాన్‌ చేశారట. సెన్సార్‌ రిపోర్ట్ పాజిటివ్‌గా ఉందని, మూవీపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా చిరంజీవి కూతురు సుస్మిత మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

36
చిరంజీవి లుక్‌పై కేరింగ్‌

చిరంజీవి లుక్‌ పరంగా చాలా కేర్‌ తీసుకున్నట్టు తెలిపారు. యంగ్‌, స్టయిలీష్‌ లుక్‌ కోసం ప్రయత్నించామని చెప్పారు. అయితే ఈ మూవీకి సెపరేట్‌గా స్టయిలీస్ట్ ని పెట్టారట. అంతకు ముందు తనే అన్నీ చూసుకునేది, కానీ ఈ చిత్రానికి తను నిర్మాత కావడంతో మరో స్టయిలీస్ట్ ని పెట్టాల్సి వచ్చిందని తెలిపింది. స్క్రిప్ట్ ల పరంగానూ డాడీ తన సలహాలు తీసుకుంటారని, అందరితోనూ డిస్కస్‌ చేస్తారని చెప్పింది. ఇందులోనూ కొన్ని తన ఇన్‌పుట్స్ ఇచ్చినట్టు తెలిపింది.

46
సుస్మిత ఫేవరేట్‌ హీరో రజనీకాంత్‌

ఈ సందర్భంగా సినిమాల్లో తనకు ఇష్టమైన హీరో ఎవరు అంటే ఆసక్తికర సమాధానంగా చెప్పింది. తండ్రి పెద్ద హీరో కావడంతో కామన్‌గానే చిరంజీవి పేరు చెబుతారు. పవన్‌ పేరు చెబుతారు. బయట హీరోల్లో ఎవరు ఫేవరేట్‌ అంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పేరు చెప్పింది సుస్మిత. చిన్నప్పట్నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం, రజనీకాంత్‌ అంటే చాలా ఇష్టమని, తన ఫేవరేట్‌ హీరో అని చెప్పింది సుస్మిత.

56
బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌తో సినిమాపై క్లారిటీ

ఈ సందర్భంగా నాన్నతో సినిమా చేయడం ప్రెజర్‌ కాదు, ప్లెజర్‌ అని తెలిపింది. దేవుడు కరుణిస్తేగానీ ఈ మూవీ తనకు వచ్చిందని చెప్పింది. బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు అంటే క్యూలో వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే బాబాయ్‌ని సినిమా చేయాలని అడిగినట్టు తెలిపింది. చాలా మంది ఆయనతో సినిమాలు చేయాలని పోటీ పడుతున్నారని, ఆ క్యూలో తాను కూడా ఉన్నట్టు తెలిపింది. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అని నవ్వుతూ వెల్లడించింది సుస్మిత. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

66
ఫుల్‌ మీల్స్ అని చెప్పినా తక్కువే

మరో నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ, సినిమా అన్ని అంశాల మేళవింపుగా ఉంటుందని, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్‌, యాక్షన్‌, సీరియస్‌ ఎలిమెంట్లు ఇలా అన్నీ ఉంటాయని, అయితే ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువే అని, సినిమాలో చాలా దాచి ఉంచామని, థియేటర్లో మూవీని చూసినప్పుడు సర్‌ప్రైజ్‌ అవుతారని తెలిపింది. ఫుల్‌ మీల్స్ అని చెప్పినా తక్కువే అవుతుందన్నారు. వెంకటేష్‌ రోల్‌ కూడా హిలేరియస్‌గా, రచ్చ రచ్చగా ఉంటుందని తెలిపారు. టికెట్‌ రేట్ల పెంపుకి ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలో క్లారిటీ వస్తుందని తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories