తమన్నాకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? వాటి కోసం అబ్బాయిలను తోసుకుంటూ, ఒంటరిగా కూర్చొని కుమ్ముడే

First Published | Dec 21, 2024, 3:18 PM IST

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న తమన్నా తనకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో బయటపెట్టింది. ఒక ఐటెమ్ విషయంలో మాత్రం ఎవ్వరికీ ఇవ్వకుండా కుమ్మేస్తుందట. 
 

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో సినిమాలు తగ్గించింది. ఒకప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో మెప్పించింది. స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది అలరించింది. కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచింది తమన్నా. ఆమె సినిమాల్లో కచ్చితంగా అదిరిపోయే డాన్సులు ఉండేవి. ఆమెని డైరెక్టర్స్ మరింత అందంగా చూపించేవాళ్లు. 

జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది తమన్నా. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. చాలా వరకు ఆమె కమర్షియల్‌ సినిమాలతో మెప్పించింది. అవి రొటీన్‌గా మారుతున్నాయి. పైగా యంగ్‌ హీరోయిన్లు వస్తున్నారు. ఈ క్రమంలో తన రూట్‌ మార్చుకుంది. తన పాత్రకు ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తుంది. 
 


అందులో భాగంగా ఇప్పుడు తెలుగులో `ఓడెల 2` చిత్రంలో నటిస్తుంది. ఇందులో తనే మెయిన్‌ లీడ్‌ కావడం విశేషం. నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటుంది తమన్నా. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తనకు ఇష్టమైన విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా తనకు ఇష్టమైన ఫుడ్‌ ఆసక్తికరంగా మారింది. 
 

తమన్నాకి ఇష్టమైన ఫుడ్‌లో సమోసా ఒకటి. చిన్నప్పుడు సమోసాలంటే పిచ్చిగా ఇష్టపడేదట. రోజుకి కచ్చితంగా మూడు సమోసాలు తినేదట. స్కూల్‌ల్లో క్యాంటీన్‌లో మాత్రం సమోసాల కోసం యుద్దమే చేసేదట. అబ్బాయిలను తోసుకుని వెళ్లి మరి తెచ్చుకునేదట. అప్పట్లో రోజూ మూడు సమోసాలు తినకుండా వదిలేది కాదట. 

దీంతోపాటు వడా పావ్ అంటే తనకు బాగా ఇష్టమని తెలిపింది తమన్నా. అయితే ఇవన్నీ చిన్నప్పుడు ఇష్టపడ్డ ఫుడ్స్. ఇప్పుడు తగ్గించిందట. కానీ ఇప్పుడు కూడా ఇష్టపడే మరో ఫుడ్‌ ఉంది.  అదే చిప్స్. మిల్కీ బ్యూటీకి చిప్స్ అంటే చాలా ఇష్టం. అది ఇప్పటికీ కొనసాగిస్తుంది. చిప్స్ దొరికితే చాలా ఒంటరిగా కూర్చొని ఎవ్వరికీ ఇవ్వకుండా తానే తినేస్తుందట. చిప్స్ అంటే తనకు అంత ఇష్టమని చెప్పింది తమన్నా. యాంకర్ ప్రదీప్‌ నిర్వహించిన `కొంచెం టచ్‌ లో ఉంటే చెబుతా` టాక్‌ షోలో ఈ విషయాలను పంచుకుంది తమన్నా. 
 

Vijay Varma, Tamannaah

మిల్కీ బ్యూటీ నేడు తన 35వ పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో `ఓడెల 2` చిత్రంతో బిజీగా ఉంది. దీంతోపాటు ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. మరోవైపు నటుడు విజయ్‌ వర్మతో ఆమె ప్రేమలో ఉంది. అయితే విడిపోయారనే రూమర్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం కలిసి ఉన్నారా? బ్రేకప్‌ చెప్పుకున్నారా? అనేది క్లారిటీ లేదు. 

read more: అనుష్కకి సమంత భార్యగా చేయాల్సింది, ఎలా మిస్‌ అయ్యింది? ఆ సినిమా ఏంటో తెలుసా?

also read: మోహన్‌బాబు అన్న, చిరంజీవి తమ్ముడు.. సినిమా బంపర్‌ హిట్‌, కలెక్షన్‌ కింగ్‌ ఇదేం ట్విస్ట్?
 

Latest Videos

click me!