అనుష్కకి సమంత భార్యగా చేయాల్సింది, ఎలా మిస్‌ అయ్యింది? ఆ సినిమా ఏంటో తెలుసా?

Published : Dec 21, 2024, 01:23 PM IST

అనుష్క శెట్టి, సమంత కలిసి ఓ సినిమా చేయాల్సింది. అంతేకాదు ఇందులో అనుష్కకి భార్యగా సమంత కనిపించాల్సింది. మరి ఆ మూవీ ఏంటి? ఆ కథేంటి? అనేది చూస్తే.   

PREV
15
అనుష్కకి సమంత భార్యగా చేయాల్సింది, ఎలా మిస్‌ అయ్యింది? ఆ సినిమా ఏంటో తెలుసా?

స్వీటి అనుష్క శెట్టి ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు పరిమితమయ్యింది. `అరుంథతి` నుంచే ఆమె ఆ వైపు టర్న్ తీసుకుంది. కానీ మధ్యలో కమర్షియల్‌ సినిమాలు కూడా చేస్తూ వచ్చింది. `బాహుబలి`లో తన విశ్వరూపం చూపించింది.  అలాగే `భాగమతి` తోనూ అలరించింది. ఆ తర్వాత నుంచి పూర్తిగా అలాంటి సినిమాలే చేస్తూ వచ్చింది. ఇప్పుడు `ఘాటి` చిత్రంతో రాబోతుంది అనుష్క. 

25

ఇక సమంత గత రెండు మూడేళ్లుగా స్ట్రగుల్స్ ఫేస్‌ చేస్తుంది. ముఖ్యంగా నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత నుంచి ఆమె లైఫ్‌ చాలా ఒడిదుడుకులతో సాగుతుంది. మానసికంగా కుంగిపోయింది. మయోసైటిస్‌ వ్యాధి వల్ల అనారోగ్యానికి గురైంది. దాన్నుంచి కోలుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే దశలో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

సమంత నాన్న చనిపోయాడు. దీంతో మరింత డౌన్‌ అయిపోయింది. దీన్నుంచి ఆమె ఎప్పుడు కోలుకుంటుంది, మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఎప్పుడు అవుతుందనేది సస్పెన్స్ గా మారింది. కానీ ఇన్ని స్ట్రగుల్స్ ని తట్టుకుని నిలబడటం సమంతలో ఉన్న గొప్ప లక్షణం. ఆమె డేరింగ్‌కి, గుండె ధైర్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. 

35
Samantha ,Anushka-Shetty

అయితే ఈ ఇద్దరు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఒకటి రెండు సార్లు చేసే అవకాశం వచ్చింది. ఇద్దరు కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ ఏం జరిగిందో ఏమో అది సెట్‌ కాలేదు. ఆమె స్థానంలో మరెవరో వచ్చారు.

మరి ఇంతకి ఆ సినిమా ఏంటో చూస్తే, అది `రుద్రమదేవి`. అనుష్క మెయిన్‌గా నటించిన చిత్రమిది. కాకతీయ సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన, కాకతీయ రాజ్యానికి ఓ గుర్తింపు తెచ్చినా, చరిత్రలో నిలిచేలా చేసిన రుద్రమదేవి జీవితం ఆధారంగా రూపొందిన `రుద్రమదేవి` సినిమాలో అనుష్క టైటిల్‌ రోల్‌ చేసింది. 

45

రానా ఆమెకి పెయిర్‌గా నటించాడు. అల్లు అర్జున్‌, నిత్యా మీనన్‌, కేథరిన్‌ థ్రెస్సా ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఇందులో సమంతకి కూడా ఆఫర్‌ వచ్చిందట. ఇందులో ఓ గెస్ట్ రోల్‌ ఉందని, అందులో మీరు నటించాలని చెప్పి టీమ్‌ నుంచి కాల్‌ వచ్చిందట సమంతకి. కానీ ఆ తర్వాత ఆ పాత్రని నిత్యా మీనన్‌ చేసిందట. అది కాస్త బాధగా అనిపించింది. అయినా ఫర్వాలేదు, నెక్ట్స్ టైమ్‌ ఛాన్స్ వస్తుందిలే అని లైట్‌ తీసుకున్నా అని చెప్పింది సమంత. 
 

55

ఇందులో అనుష్క మొదట్లో రుద్ర దేవుడిగా కనిపిస్తుంది. అంటే అబ్బాయిగా కనిపిస్తుంది. అబ్బాయిగానే ముక్తాంబతో పెళ్లి చేస్తారు. ఆ ముక్తాంబ పాత్రలో నిత్యా మీనన్‌ నటించారు. అయితే ఆమెకి ఈ విషయం చెప్పే ఇతర రాజ్యాల నుంచి యుద్ధానికి సంబంధించిన ప్రమాదాలు ఉంటాయని భావించి ఆ విషయం తెలియకుండా మ్యానేజ్‌ చేస్తారు.

అదే ఈ సినిమాలో హైలైట్‌ పాయింట్‌. ఇందులో నిత్యా మీనన్‌ బాగా చేసి మెప్పించింది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్‌ మూవీ 2015లో విడుదలై బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనని రాబట్టుకుంది.

read more: మోహన్‌బాబు అన్న, చిరంజీవి తమ్ముడు.. సినిమా బంపర్‌ హిట్‌, కలెక్షన్‌ కింగ్‌ ఇదేం ట్విస్ట్?

also read: థియేటర్లో `పుష్ప 2` క్రిస్మస్‌ సర్‌ప్రైజ్‌, షాకిచ్చే నిర్ణయం తీసుకున్న టీమ్‌, ఏం చేయబోతున్నారంటే


 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories