బాలయ్యకు తల్లి, భార్యగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : May 13, 2025, 04:57 PM IST

నందమూరి బాలకృష్ణ తో చాలామంది హీరోయిన్లతో కలిసి నటించారు. ఆయనతో సినిమా అంటు ఎగిరి గంతేస్తుంటారు హీరోయిన్లు. అయితే బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా మాత్రమేకాకుండా తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?   

PREV
16
బాలయ్యకు తల్లి, భార్యగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ప్రస్థానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 65 ఏళ్ల వయసులోనూ వరుస హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. ఇటీవల వరుసగా నాలుగు సినిమాలతో రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి, తన మాస్ క్రేజ్‌ను మరోసారి నిరూపించారు. అలాగే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డును స్వీకరించి మరో గౌరవాన్ని అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

26

ఇవన్నీ పక్కనపెడితే, బాలయ్యకు తల్లి, భార్య, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ టబు అనే విషయాన్ని చాలామందికి తెలియకపోవచ్చు. టబు, బాలయ్యతో మూడు విభిన్న పాత్రల్లో నటించడం విశేషం.
 

36
Nandamuri Balakrishna paid 7.75 lakhs for fancy number for vehicle

చెన్నకేశవ రెడ్డి (2002)  సూపర్ హిట్ సినిమాలో టబు, బాలకృష్ణకు భార్య పాత్రలో నటించడంతో పాటు, సినిమాలో ఉన్నరెండో  బాలకృష్ణకు తల్లి పాత్రను కూడా పోషించారు. ఈ  వివి వినాయక్ డైరెక్ట్ చేయగా.. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
 

46

ఆ తరువాత పాండురంగడు (2008) చిత్రంలో టబు, బాలకృష్ణకు ప్రియురాలిగా కనిపించారు. ఈ సినిమాను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించారు. బాలయ్యకు తల్లి, భార్య, ప్రియురాలిగా కనిపించిన ఏకైక హీరోయిన్‌గా టబు గుర్తింపు పొందారు.

56

టబు ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల్లో బిజీగా ఉన్నారు.

66
Nandamuri Balakrishna

ఇక ప్రస్తుతం బాలయ్య బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మెగా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బాబీతో డాకూ మహరాజ్ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈమూవీ షూటింగ్ సూపర్ ఫస్ట్ గా జరుగుతుంది. త్వరలో రిలీజ్ కు రెడీకాబోతున్నట్టు తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories