ఆకాలంలోనే అద్భుతాలు చేశారు
అయితే టెక్నాలజీతో పనిలేకుండా టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు గతంలో వచ్చాయి. మరీ ముఖ్యంగా ఎన్టీ రామారావు, సింగీతం శ్రీనివాసరావు, కేవి రెడ్డి లాంటి దర్శకులు ఏం మాయ చేశారో కాని కొన్ని సినిమాలలో అద్భుతమైన విజ్యూవల్ ఎఫెక్ట్ చూపించగలిగారు. ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాలో మూడు పాత్రలు చేయడం. మయసభ సెట్టింగ్ అద్భుతం. ఇక మాయా బజార్ సినిమా అయితే ఆ గ్రాఫిక్స్ ఎలా చేశారో కూడా తెలియదు. ఘటోత్కచుడిమాయ, అర్జునుడు శశిరేఖకు పంపించిన ప్రియదర్శిని, సత్య పీఠిక ఇలా ఎన్నో అద్భుతాలు అప్పటి ప్రేక్షకులను మద్రముగ్ధులను చేశాయి. ఇప్పటికీ ఈఎఫెక్ట్స్ ను ఆ కాలంలో ఎలా చూపించగలిగారో చాలా మందికి అర్ధం కాని విషయమే. ఇక సింగీతం శ్రీనివాసరావు చేసిన అద్భుతాలు అయితే చెప్పలేము. ఆయన 100 ఏళ్ళకు పైగా అడ్వాన్స్ గా ఆలోచించి ఆదిత్య 369 సినిమా చేశారు. ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ మిషన్ ను 35 ఏళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు సింగీతం. ఇలా ఆకాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు అప్పటి మూవీ మేకర్స్.