పాకిస్తాన్ లోను పుష్పకు భారీగా ఫ్యాన్స్
పుష్ప, పుష్ప2 సినిమాలకు, ఇందులో డైలాగ్స్ కు, బన్నీ మ్యానరిజానికి, ప్రపంచ వ్యాప్తంగా స్పందన వచ్చింది. ఈ సినిమాకు గతంలో డేవిడ్ వార్నర్, డీజే బ్రావో వంటి సెలబ్రిటీలు డ్యాన్స్ చేస్తూ స్పందించిన సంగతి తెలిసిందే. జపాన్ కపుల్ డాన్స్, కొరియన్ స్టార్ బన్నీని ఇమిటేట్ చేయడం లాంటి వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాయి. పుష్ప రెండు సినిమాలతో జపాన్, కొరియా, చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో అల్లు అర్జున్ కు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. విచిత్రం ఏంటంటే పుష్ప సినిమా వల్ల పాకిస్తాన్ లో కూడా అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇప్పుడు అంతర్జాతీయ టీవీ షోలో ఈ పాట వినిపించడంతో, అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో మాస్ లెవెల్ స్టార్‌గా గుర్తింపు పొందుతున్నందుకు సంతోషిస్తున్నారు అభిమానులు.