మహేష్ బాబు సహా.. 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య..

First Published | Aug 18, 2024, 2:38 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా.. 12 మంది హీరోలు ఓ కథను రిజెక్ట్ చేయగా.. ఆసినిమాను చేయడంతో పాటు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సూర్య. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా..? 
 

కొన్ని సినిమాలు కొంత మంది హీరోలకు రాసిపెట్టి ఉంటాయి.. వేరే హీరోతో చేయాలి అనుకున్నా అది సాధ్యం అవ్వదు కూడా..ఈ విషయం చాలా సార్లు నిరూపించబడింది కూడా. ఓ సినిమా కథ అయితే.. 12 మంది హీరోలు రిజెక్ట్ చేస్తే..సౌత్ స్టార్ హీరో సూర్య ఆ సినిమాను ధైర్యంగా చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు  ఇంతకీ ఏంటా సినిమా తెలుసా..?

ప్రభాస్ కోసం 100 ఎకరాలు.. యంగ్ రెబల్ స్టార్ ఏం చేయబోతున్నారో తెలుసా..?

suriya starrer ghajini was rejected by r madhavan

ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు గజిని. అవును ఈ సినిమాను చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారట. అందులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడట. మహేష్ బబుతో పాటు అజిత్, మాధవన్, కమల్ హాసన్, విక్రమ్,  విశాల్ లాంటి  12 మంది నటులు గజిని కథ విని రిజెక్ట్ చేశారట. కాని సూర్య మాత్రం ఈసినిమాలో నటించి హిట్ అయ్యాడు. ఏఆర్‌ మురుగదాస్‌, సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘గజిని’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది 

నేషనల్ అవార్డ్స్ లో రికార్డ్ అతనిదే..? అత్యధికంగా జాతీయ అవార్డ్స్ సాధించిన స్టార్ ఎవరు..?

Latest Videos


అంతే కాదు తమిళ భాషలో మాత్రమే కాకుండా.. తెలుగులో కూడా డబ్బింగ్ చేయబడి ఈమూవీ టాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగులో సూర్య మార్కెట్  డబుల్ చేసిన సినిమా గజినీ. ఇక ఈమూవీ రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తరువాత తర్వాత  హిందీలో రీమేక్ చేసి విడుదల చేశారు. 

Suriya: The life-changing film that put Suriya on the A-list of actors after his performance was Ghajini in Tamil, wherein he plays a person who suffers from memory loss. The actor chose to go bald for the character.

ఇందులో అమీర్ ఖాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ లో ఈసినిమా సంచలనంగా3 మారింది. హిందీలో ఈసినిమా 100 కోట్లు వసూలు చేసి బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

Ghajini

తమిళ గజినిలో సూర్య, అసిన్, ప్రదీప్ రావత్ తో పాటు ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ హీరోయిన్  నయనతార సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక  AR మురుగదాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మెమెరీ పవర్ ను లాస్  అయిన  సూర్య, నయనతార సహాయంతో తన ప్రేయసి అసిన్ హంతకులను కనుగొని ప్రతీకారం తీర్చుకోవడం గజినీ కథ.
 

దాదాపు రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గజిని బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వరకు వసూలు చేసింది. అదేవిధంగా బాలీవుడ్ లో రూ.62 కోట్ల బడ్జెట్ తో రూపొందిన గజినీ ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల వరకు వసూలు చేసింది. ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది. ఇప్పటికీ  టీవీల్లో ఈసినిమా ప్లే అవుతుంది అంటే.. చాలామంది ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతుంటారు. 

click me!