దీనితో శ్రీలీల ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకుంటోంది. తాను ఎంచుకునే చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని,ప్రతి కథని ఓకె చేసేయ కూడదని భావిస్తోంది. అయితే తాజాగా శ్రీలీల ఒక క్రేజీ ఆఫర్ ని రిజెక్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ లో, వశిష్ట్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.