'బేబీ' కాంబినేషన్ పై అనుమానాలు.. కారణం ఇదే..

First Published | Aug 18, 2024, 2:36 PM IST

అతి చిన్న చిత్రం గా విడుదలైన బేబీ మూవీ టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆనంద్ దేవరకొండ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ బేబీ మూవీతో దక్కింది. 

అతి చిన్న చిత్రం గా విడుదలైన బేబీ మూవీ టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆనంద్ దేవరకొండ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ బేబీ మూవీతో దక్కింది. కొత్త హీరోనే వైష్ణవి చైతన్య ఈ చిత్రంతో అందరిని మాయ చేసింది. 

సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ అందిస్తారు. ఎస్ కె ఎన్ తో పాటు నిర్మాతగా ఉంటారు. రవి నంబూరి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 


ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం తెరకెక్కడం అనుమానంగా ఉన్నట్లు సమాచారం. కథ సిద్ధం చేయడంలో చాలా సమయం పడుతోంది. ఇప్పటి వరకు రెడీ అయిన కథ పట్ల ఆనంద్ దేవరకొండ సంతృప్తిగా లేడని టాక్. 

ఈ చిత్రం బేబీ ని మించేలా ఉండాలని.. దాని కోసం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఆనంద్ దేవరకొండ అంటున్నాడట. దీనితో సరైన స్క్రిప్ట్ లేకుండా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లడం అనుమానంగానే ఉంది. 

Latest Videos

click me!