Suriya Net Worth: సూర్య ఆస్తుల విలువెంతో తెలుసా? సొంతంగా వందల కోట్లకు అధిపతిగా ఎదిగిన స్టార్‌ హీరో

Published : Jul 23, 2025, 10:11 AM IST

నటుడు సూర్య తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో, ఆయన ఆస్తుల విలువ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
నటుడు సూర్య ఆస్తుల విలువ

సీనియర్‌ నటుడు శివకుమార్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సూర్య.  1997లో విడుదలైన `నేరుకు నేరు` సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

 శివకుమార్ కుమారుడిగా సులువుగా సినీ రంగ ప్రవేశం చేసిన సూర్యకు విజయాలు అంత తేలికగా రాలేదు. నటన సరిగ్గా రాలేదని విమర్శలు ఎదుర్కొన్న సూర్య, తనదైన శైలి నటనతో స్టార్ హీరోగా ఎదిగారు.

తన నటనతో, కష్టంతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. `నందా` సినిమాకు ముందు `నేరుకు నేరు,  `సందిప్పోమా`, `పెరియన్న`, `పూవేళ్ళాం కేట్టుప్పార్`, `ఉయిరిలే కలన్దతు`, `ఫ్రెండ్స్` వంటి సినిమాల్లో నటించారు. `ఫ్రెండ్స్` సినిమాలో విజయ్ తో కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు. కానీ, మిగతా సినిమాలు పెద్దగా ఆడలేదు.

25
సూర్యకు టర్నింగ్ పాయింట్ సినిమాలు

మొదట్లో నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు దొరక్కపోవడంతో సూర్యకు అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో బాల దర్శకత్వం వహించిన `నందా` సినిమా సూర్యపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది.

 సరైన పాత్ర దొరికితే అద్భుతంగా నటిస్తాడనే నమ్మకాన్ని కలిగించింది. సూర్యను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా `నందా`. ఆ తర్వాత వచ్చిన `గజిని` సినిమా సూర్యను స్టార్ హీరోగా నిలబెట్టింది. సినిమా విడుదలకు ముందే హారిస్ జయరాజ్ పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

 యాక్షన్ హీరోగా నటించిన సూర్య అభిమానులను నిరాశపరచలేదు. మంచి పాటలు, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించింది `గజిని`.ఇది సంచలన విజయం సాధించింది. 

35
సూర్యను మలిచిన దర్శకులు

రెండేళ్లలో `నందా`, `గజిని` సినిమాలు సూర్య సినీ జీవితాన్ని మార్చేశాయి. ఆయన స్థాయిని పెంచాయి. దీంతో స్టార్ హీరోగా మారారు. ఆ తర్వాత `పితామగన్` లో మంచి నటుడిగా మరోసారి నిరూపించుకున్నారు. 

`ఆయుధ ఎజుత్తు`(యువ) సినిమాలో మణిరత్నం దర్శకత్వంలో నటించారు.  ప్రతీకార కథ అయినప్పటికీ, విభిన్నంగా చెప్పడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.నటులుగా మరో మెట్టు ఎక్కించిందీ మూవీ. 

వార్తా పత్రికల్లో వచ్చే సంచలన వార్తలను కథలుగా మలచడంలో దర్శకుడు కె.వి. ఆనంద్ దిట్ట. భారత్ నుంచి మాదక ద్రవ్యాలను విదేశాలకు తరలించడం వంటి వార్తలను తరచూ చూస్తుంటాం. అలాంటిదే `అయన్` కథ. కమర్షియల్ సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటుంది `అయన్`. సూర్య సినీ జీవితంలో మరో టర్నింగ్ పాయింట్.

45
సూర్య కమర్షియల్ అవతారం

హరితో కలిసి `ఆరు`, `వేల్` సినిమాలలో నటించిన సూర్య, ఆ తర్వాత `సింగం` కోసం మళ్లీ కలిశారు. సింగం కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్ అన్నీ సూపర్. దురై సింగంగా అదరగొట్టారు సూర్య. 

`వారణం ఆయిరం`(సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌) గౌతమ్ మీనన్ - సూర్య కాంబినేషన్ లో వచ్చిన మరో అందమైన సినిమా. కాలేజీ విద్యార్థి, ప్రేమికుడు, వృద్ధుడు ఇలా పలు గెటప్స్ లో అదరగొట్టారు సూర్య.

 సిక్స్ ప్యాక్ తో అబ్బురపరిచారు. మంచి సన్నివేశాలు, అద్భుతమైన పాటలతో ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చింది `వారణం ఆయిరం`. ఇది తెలుగు ఆడియెన్స్ ని సైతం ఎంతగానో ఆకట్టుకుంది. 

55
సూర్య కంబ్యాక్ సినిమాలు సూర్య ఆస్తుల విలువ

సుధా కొంగర దర్శకత్వం వహించిన `సూరరై పోట్రు` సూర్య కెరీర్ లో మరో మలుపు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 

ఆ తర్వాత `జై భీమ్` దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితుల తరపున న్యాయవాదిగా నటించిన సూర్య, ఈ సినిమాను నిర్మించినందుకు ప్రశంసలు అందుకున్నారు.

ఆ తర్వాత `విక్రమ్` సినిమాలో రోలెక్స్ పాత్రలో కనిపించినా, ఆ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సూర్య తప్ప మరెవరూ ఆ పాత్రలో అంత బాగా నటించి ఉండలేరు. 

ఆ తర్వాత `కంగువా`, `రెట్రో` వంటి సినిమాల్లో నటించారు. అవి పెద్దగా ఆడలేదు.  ప్రస్తుతం `కరుప్పు` సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

సూర్య హీరోయిన్‌ జ్యోతికని వివాహం చేసుకున్నారు. నటుడు కార్తి ఆయన తమ్ముడనే విషయం తెలిసిందే.  మంచి నటుడిగానే కాదు, మంచి కొడుకుగా, సోదరుడిగా, భర్తగా రాణిస్తున్న సూర్య, అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చదువుకు సహాయం చేస్తున్నారు. 

50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సూర్యకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సూర్య ఆస్తుల విలువ రూ.350 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. చెన్నైలో ఆయనకు సొంత బంగ్లా ఉంది.

 ముంబైలో ఖరీదైన ఫ్లాట్ లో ఉంటున్నారు. చెన్నై ఈసీఆర్ లో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారట. సూర్య తెలుగులోనూ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. దర్శకుడు వెంకీ అట్లూరితో మూవీ చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories