
Hari Hara Veera Mallu Movie First Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన్నుంచి వస్తోన్న తొలి చిత్రం `హరి హర వీరమల్లు`. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
క్రిష్ మొదట డైరెక్ట్ చేయగా, ఆయన పలు కారణాలతో తప్పుకున్నారు. ఆ సమయంలో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాని పూర్తిచేశారు. ఈ నెల 24న, గురువారం ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
పవన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడం, అదే సమయంలో పవన్ నటించిన తొలి హిస్టారికల్ మూవీ కావడం విశేషం. దీనికితోడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం మరో విశేషం.
దీంతో సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ మూవీ కోసం ప్రమోషన్స్ చేయడం ఆశ్చర్యంగా మారింది. `హరి హర వీరమల్లు` మూవీ దాదాపు ఆరేళ్ల క్రితం స్టార్ట్ చేశారు.
కరోనా కారణంగా, ఆర్థిక పరమైన ఇబ్బందులు, దీనికితోడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో షూటింగ్ డిలే అయ్యింది. అలాగే చివర్లో బిజినెస్ సెటిల్ విషయంలో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పలు మార్లు వాయిదా వేశారు.
ఎట్టకేలకు సినిమా గురువారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అన్ని అడ్డంకులు దాటుకుని ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. మరి ఈ మూవీ ఎలా ఆకట్టుకోబోతుందో చూడాలి.
ఇదిలా ఉంటే `హరి హర వీరమల్లు` సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ఉండబోతుందో సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. ఇప్పటికే సెన్సార్ రివ్యూ కూడా వచ్చింది. సెన్సార్ వాళ్లు యూ / ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.
అదే సమయంలో సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా లీక్ అయ్యింది. పూనకాలు తెప్పించే విషయాలు వాళ్లు రివీల్ చేయడం విశేషం. ఈ సినిమా 17వ శతాబ్దంలో సాగుతుందని, మొఘల్ పాలన సమయంలో ఔరంగజేబ్ చేసిన అరాచకాలను చూపించబోతున్నట్టు పవన్ కళ్యాణ్ పలు మార్లు తెలిపారు.
హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే రూల్ తెచ్చారని, దానిపై వీరమల్లు ఎలా తిరుగుబాటు చేశారనేది ఆసక్తికరంగా ఉండబోతుందట. ఇందులో మరో ఎలిమెంట్ ఉంది.
విజయవాడ సమీపంలోని కొల్లూర్‌లో దొరికిన కొహినూర్ వజ్రం నిజాం నవాబ్ వద్దకు ఎలా వెళ్లింది, వారినుంచి బ్రిటీష్ వారికి ఎలా చేరింది, దాన్ని దొంగిలించుకురావాలనే పనిని వీరమల్లుకి నిజాం నవాబ్ అప్పచెప్పడం, దాని కోసం వీరమల్లు చేసే పోరాటమే ఈ మూవీ కథ అని పవన్ స్పష్టం చేశారు. కథేంటో, ఆడియెన్స్ ఏం చూడబోతున్నారో ఇప్పటికే రివీల్ చేశారు పవన్.
ఈ క్రమంలో ఇప్పుడు సినిమా ఎలా వచ్చింది? ఎలా ఉందనేది సినిమా చూసినవారు చెబుతున్నారు. సెన్సార్ టాక్, `హరి హర వీరమల్లు` టీమ్ నుంచి తెలుస్తోన్న సమాచారం మేరకు సినిమా అదిరిపోయిందట.
ఇన్నాళ్లు మూవీ కంటెంట్‌పై పెద్దగా అంచనాలు లేవు, కానీ థియేటర్‌లో ఇది సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతుందట. ఫైనల్ ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందట. పవన్ కళ్యాణ్ చాలా కేర్ తీసుకున్నారట. అలాగే దర్శకుడు జ్యోతికృష్ణ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టారట.
క్లైమాక్స్ ఫైట్‌ని పవనే కంపోజ్ చేశారు. అయితే అది పూనకాలు తెప్పించేలా ఉంటుందట. క్లైమాక్స్ ఆడియెన్స్ ని వేరే లెవల్‌కి తీసుకెళ్తుందట.ఆ సమయంలో కీరవాణి బీజీఎం సైతం మరింత ఎలివేట్ చేసేలా ఉంటుందంటున్నారు.
దర్శకుడు జ్యోతికష్ణ, క్రిష్ కలిసి ఒక పవర్ ప్యాక్డ్ ఎపిక్ మూవీని అందించారని, యాక్షన్ సీన్లు, ఫాంటసీ ఎలిమెంట్లు, వార్ ఎపిసోడ్, ముఖ్యంగా డ్రామా, అందులోని ఎమోషన్స్ ఇందులో హైలైట్‌గా ఉంటుందట.
పవన్ సినిమాల్లో ఇది నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందంటున్నారు. ఇది మొఘల్ నవాబ్‌లపై తిరుగుబాటు చేసిన మొదటి వీరుడు వీరమల్లు కథని చెబుతుందని, అతని లక్ష్యం, అతని ధైర్యం, తిరుగుబాటు చేసే విధానం అదిరిపోయిందని, డైలాగ్‌లు సినిమాకి మరో అసెట్ అని, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాయని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అని, యాక్టింగ్ పరంగానూ ఆయన్ని మరో లెవల్‌లో చూసేలా ఉంటుందంటున్నారు. పవన్‌తోపాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్ , సత్యరాజ్ వంటి వారు బెస్ట్ పర్ ఫెర్మెన్స్ ఇచ్చారని చెబుతున్నారు.
టెక్నీకల్‌గా చూస్తే జ్ఞాన శేఖర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ అదిరిపోయిందని, విజువల్స్ గ్రాండియర్‌గా ఉండబోతున్నాయట. ట్రైలర్‌లోనూ ఆ విషయం స్పష్టమైంది.
ఇక ప్రవీణ్ కేలె్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంటుందట. ఈ మూవీ నిడివి రెండు గంటల 42 నిమిషాలు ఉంటుందని ఇప్పటికే సెన్సార్ రిపోర్ట్ లో తేలింది. సినిమా చాలా క్రిస్పీగా ఉండబోతుందని, టైట్ స్క్రీన్‌ప్లేతో సాగుతుందని టాక్.
ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సినిమాకి మరో పెద్ద అసెట్ అని, పాటలు వీరోచితంగా ఉండటమే కాదు, బీజీఎం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటుందట. సాయి మాధవ్ బుర్రా డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా ఉంటాయని చెబుతున్నారు.
ఓవరాల్‌గా సినిమా మంచి సోల్ ఉన్న కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ అని, బాక్సాఫీసుని షేక్ చేసే సినిమా అవుతుందంటున్నారు. దీంతో ఇదిప్పుడు పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది.
నిజంగానే సినిమా అలా ఉంటే బాక్సాఫీసు షేక్ కావడం పక్కా. మరి నిజంగానే అలా ఉందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.