`జై భీమ్‌`లో సినతల్లి ఎవరో తెలుసా?.. ఆమె నేపథ్యం, స్టడీస్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

First Published | Nov 5, 2021, 6:25 PM IST

`జై భీమ్` చిత్రంలో సూర్య.. జస్టీస్‌ కె చంద్రు పాత్రలో నటించారు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర `సినతల్లి`. రాజన్న భార్యగా, గర్భిణిగా ఉంటూ తన భర్త కోసం, న్యాయం కోసం పోరాడిన మహిళగా అందరి ప్రశంసలందుకుంది.

సూర్య(Suriya) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `జై భీమ్‌`(Jai Bhim) ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శల ప్రశంసలతోపాటు మంచి పాజిటివ్‌ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తమిళనాడు రిటైర్డ్ జడ్జ్ కె చంద్రు జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య.. జస్టీస్‌ కె చంద్రు పాత్రలో నటించారు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర `సినతల్లి`. రాజన్న భార్యగా, గర్భిణిగా ఉంటూ ఆమె తన భర్త కోసం న్యాయం కోసం పోరాడిన విషయం తెలిసిందే. 
 

సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర సినతల్లి పాత్ర అందరికి కనెక్ట్ అయ్యింది. అందులో ఆమె నటన కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఆమె న్యాయం కోసం పోరాడిన తీరు, పోలీసుల హింసని, అవమానాలను, ఊర్లో హేలనలు భరిస్తూ భర్త కోసం ఏకంగా హైకోర్ట్ లోనే పోరాడుతుంది. సినతల్లిగా విజయం సాధిస్తుంది. తన భర్తని లాకప్‌లో చంపేసిన పోలీసుల అరాచకాలను బట్టబయలు చేస్తుంది. అలుపెరగని పోరాటం విజయం సాధించింది. 

Latest Videos


అయితే ఎంతో అద్భతంగా సినతల్లి పాత్రలో నటించిన ఆ నటి ఎవరనేది ఇప్పుడు అందరి వెంటాడుతుంది. ఆమె గురించి తెలుసుకోవాలని తపిస్తున్నారు. ఆమె గురించి గూగుల్‌లో వెతకడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె గురించి పలు ఆసక్తికర, షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. సినతల్లి పాత్రలో నటించిన నటి గురించి తెలుసుకుని అవాక్కవుతున్నారు. 
 

`జైభీమ్‌`లో గిరిజన మహిళ సినతల్లిగా నటించిన నటి పేరు లిజోమోల్‌ జోస్‌(Lijomol Jose). మలయాళ నటి. కేరళాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. సినిమాలపై ఆసక్తితో ఆమె అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు టీవీ చానెల్‌లోనూ పనిచేశారు. ఆ తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ సైన్స్ లో మాస్టర్‌ చేశారు. తన స్నేహితురాలి సూచన మేరకు సినిమా ఆడిషన్స్ లో పాల్గొని ఎట్టకేలకు నటిగా మారారు. 

మొదటగా Lijomol Jose మలయాళంలో స్టార్‌ హీరో ఫహద్‌ ఫాజిల్‌ నటించిన `మహాశింతే ప్రతీకారం` చిత్రంలో నటించింది. ఇందులో చిన్న పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత వరుసగా `హానీ బీస్‌2.5`, `స్ట్రీల్‌ లైట్స్`, `ప్రేమసూత్రం` చిత్రాల్లో నటించింది. తమిళంలో సిద్ధార్థ్‌ హీరోగా నటించిన `సివప్పు మంజల్‌ పచ్చాయ్‌`(ఒరేయ్‌ బామ్మర్ది` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో సిద్ధార్థకి జోడీగా నటించి మెప్పించింది. అందరి దృష్టిని ఆకర్షించింది లిజోమోల్‌. 

ఈ సినిమానే `జై భీమ్‌` చిత్ర దర్శకుడు జ్ఞానవేల్‌ చూపుల్లో పడేలా చేసింది. ఆ సినిమాలో లిజోమోల్‌ నటన నచ్చి సూర్య హీరోగా రూపొందిన `జై భీమ్‌`లో ఎంపిక చేశారు. ఇందులో తాను నటించిన సినతల్లి పాత్ర కోసం ఆమెనే స్వయంగా మేకోవర్‌ అయ్యారట. డీ గ్లామర్ లుక్ని తనే ట్రై చేసి దర్శకుడి చేత ఫైనలైజ్‌ చేయించుకుందట. సినిమాలో కూడా సినతల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇంకా చెప్పాలంటే పలు సన్నివేశాల్లో సూర్యని కూడా డామినేట్‌ చేసిందని చెప్పొచ్చు. 

భర్త రాజన్న మరణానికి సంబంధించిన సీన్లు, పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్లలో లిజో అసలు గ్లీజరిన్‌ లేకుండా ఏడుపు సన్నివేశాలు చేసిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం `జై భీమ్‌` సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయింది. ఈ సినిమా లిజోమోల్‌ కెరీర్ మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. ఇప్పుడు బలమైన మహిళా పాత్రలకు ఆమె హాట్‌ కేక్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. 
 

ఇక ఇటీవలే ఆమెకి మ్యారేజ్‌ కూడా జరిగింది. తన ప్రియుడు, స్నేహితుడు అరుణ్‌ ఆంటోనిని అక్టోబర్‌ 5న మ్యారేజ్‌ చేసుకుంది. ఈ ఫోటోలను తాను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఇటీవల మ్యారేజ్‌ కావడం, కెరీర్‌లో పెద్ద హిట్‌ దక్కడంతో లిజోమోల్‌ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. . 

also read: తాప్సితో నటించేందుకు నో చెబుతున్న హీరోలు.. ఆమెని భరించడం కష్టం..

click me!