సూర్య , జ్యోతిక పిల్లలు ఎంత ఎదిగిపోయారో చూశారా ? వైరల్ అవుతోన్న ఫోటోస్

Published : Nov 26, 2025, 02:56 PM IST

సౌత్ స్టార్ హీరో  సూర్య కొడుకు దేవ్, కూతురు దియా, నటుడు కార్తీ కూతురు ఉమయాల్, కొడుకు కందన్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్ కిడ్స్ ఎంత పెద్దోళ్లు అయ్యారో తెలుసా? 

PREV
14
సూర్య, కార్తీ ఫ్యామిలీ ఫోటోస్ ..

నటుడు శివకుమార్ వారసులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సూర్య, కార్తీ. తమిళంతో పాటు సౌత్ లో స్టార్స్ గా ఎదిగారు. సూర్య నటిస్తున్న 'కరుప్పు' అనే సినిమా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఆర్.జె. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే జనవరిలో విడుదల కానుంది. అలాగే కార్తీ నటిస్తున్న 'వా వాతియార్' సినిమా కూడా రెడీ అవుతోంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది.

24
సినిమాలకు దూరంగా సూర్య, కార్తీ పిల్లలు

సూర్య నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జంటకు దియా అనే కూతురు, దేవ్ అనే కొడుకు ఉన్నారు. ఇద్దరూ ప్రస్తుతం ముంబైలో చదువుతున్నారు. అలాగే నటుడు కార్తీ, రంజనిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఉమయాల్ అనే కూతురు, కందన్ అనే కొడుకు ఉన్నారు. సూర్య కొడుకు, కూతురిని అప్పుడప్పుడు బయట చూసే ఉంటారు. కానీ కార్తీ పిల్లలు పెద్దగా సినిమా ఈవెంట్లలో కనిపించలేదు.

34
అభిమానులకు కనువిందు చేసిన స్టార్స్

ఈ నేపథ్యంలో, ఓ కుటుంబ వేడుకలో సూర్య, కార్తీ తమ భార్యలు, పిల్లలతో కలిసి పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో సూర్య కొడుకు దేవ్, తండ్రి కంటే ఎక్కవ హైట్ పెరిగాడు. అలాగే సూర్య కూతురు దియా, తల్లి జ్యోతిక అంత ఎత్తులో కనిపిస్తోంది. ఇద్దరినీ చూసి షాకైన అభిమానులు .. అప్పుడే ఇంత పెద్దవాళ్లయ్యారా అని ఆశ్చర్యపోతూ..  కామెంట్స్ చేస్తున్నారు.

44
మొదటిసారి కనిపించిన కార్తీ కుటుంబం

మరోవైపు హీరో  కార్తీ కూతురు ఉమయాల్ కూడా గుర్తుపట్టలేనంతగా పెరిగింది. ఆమె తన తాత శివకుమార్ పక్కన నిలబడి ఫోటోలకు పోజు ఇచ్చింది. అలాగే కార్తీ కొడుకు కందన్, సూర్య కూతురు దియాతో కలిసి చాలా క్యూట్‌గా ఫోటోకి పోజులిచ్చాడు. ఈ ఫోటోలో సూర్య చెల్లెలు బృందా శివకుమార్ కూడా ఉన్నారు. ఆమె జ్యోతిక, కార్తీ భార్య రంజనితో కలిసి ఫోటో దిగారు.

Read more Photos on
click me!

Recommended Stories