ఇక మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి అద్భుతమైన సినిమాలు చేశారు. మరీ ముఖ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. శ్రీదేవికి అతిలోక సుందరి ఇమేజ్ తీసుకువచ్చిన సినిమా ఇది. ఆ సినిమా తరువాత శ్రీదేవి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ లో కూడా శ్రీదేవి అంటే ఎంతలా పడిచస్తారో అందరికి తెలుసు.