ఇంకా పెళ్లేందుకు చేసుకోవడం లేదు, శృతి హాసన్‌ రియాక్షన్‌ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

First Published | Oct 16, 2024, 6:59 PM IST

శృతి హాసన్‌ ఇటీవలే ప్రియుడికి బ్రేకప్‌ చెప్పింది. అంతలోనే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు నెటిజన్. దీనికి ఆమె రియాక్షన్‌ చూస్తే మాత్రం పిచ్చెక్కిపోవాల్సిందే. 
 

photo credit -shruti haasan insta

శృతి హాసన్‌.. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ కూతురుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు తనకంటూ ఓ సెపరేట్‌ గుర్తింపుని తెచ్చుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. శృతి హాసన్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ అయినా, ఆమె కమర్షియల్‌ సినిమాలు చేసినా అందులో కంటెంట్‌ ఉన్న సినిమాలని ఎంపిక చేసుకుంటుంది. అందుకే ఆమె నటించిన సినిమాల్లో చాలా వరకు మంచి విజయాలు సాధించిన చిత్రాలే ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌ అయినా, రవితేజ అయినా, బాలయ్య అయినా, మెగాస్టార్‌ అయినా హిట్‌ సినిమాలు పట్టుకుంటూ దూసుకుపోతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

photo credit -shruti haasan insta

గతేడాది బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు విజయాలు అందుకుంది శృతి హాసన్‌. తెలుగులోనే సంక్రాంతికి ఓకేసారి `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహా రెడ్డి` చిత్రాలు చేసింది. ఒకేసారి ఈ రెండు విజయాలే సాధించాయి. ఇక ఏడాది చివర్లో `సలార్‌`తో హిట్‌ కొట్టింది. దీంతోపాటు `హాయ్‌ నాన్న`లో గెస్ట్ గా మెరిసింది. ఓ హాలీవుడ్‌ మూవీలో నటించింది.

ఈ ఏడాది ఇంకా ఖాతా తెరవలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తెలుగులో అడవిశేషుతో `డెకాయిట్‌` మూవీ చేస్తుంది. అలాగే రజనీకాంత్‌తో `కూలీ` చిత్రంలో నటిస్తుంది. `చెన్నై స్టోరీ` అనే మరో సినిమాలో నటిస్తుంది. `సలార్‌ 2` కి ఇంకా టైమ్ పడుతుంది. 
 


photo credit -shruti haasan insta

ఇలా షూటింగ్‌లతో బిజీగా ఉన్న శృతి హాసన్‌ ఇటీవలే తన బాయ్‌ ఫ్రెండ్‌కి బ్రేకప్‌ చెప్పిందట. ఆమె గత నాలుగేళ్లుగా డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. లాక్‌ డౌన్‌ సమయంలో ఇద్దరు కలిసే ఉన్నారు. మొన్నటి వరకు కలిసి సహజీవనం చేశారు. కానీ ఇటీవలే ఈ ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో శృతి హాసన్‌ పెళ్లి ప్రస్తావన వచ్చింది. సోషల్‌ మీడియాలో చాట్‌ చేస్తున్న క్రమంలో ఆమెకి పెళ్లి గురించి అడిగాడు ఓ నెటిజన్‌. మ్యారేజ్‌ ఎప్పుడు చేసుకుంటావ్‌, ఎంత కాలం ఒంటరిగా ఉంటావ్‌ అని ప్రశ్నించారు ఓ నెటిజన్‌. 
 

photo credit -shruti haasan insta

దీనికి శృతి హాసన్‌ రియాక్షన్‌ మాత్రం క్రేజీగా ఉండటం విశేషం. ఆ నెటిజన్‌కి చెంపదెబ్బలాంటి సమాధానం ఇచ్చింది. `మీరు ఎందుకు ఎప్పుడూ స్టూపిడ్‌ గా ఉంటారు` అని స్పందించింది. అంతేకాదు ఓ విచిత్రమైన ఫోటోని షేర్‌ చేసింది.

ఇందులో ఆమె తన ఫేస్‌ని విచిత్రంగా చేసింది. మౌత్‌ని చాలా పెద్దగా చేసి, కళ్లు సాగిపోయినట్టుగా చేసి ఓ ఫోటోని పంచుకుంది. ఓ రకంగా ఆ నెటిజన్‌ని బండ బూతులు తిట్టినట్టుగా ఆ పోస్ట్ ఉండటం విశేషం. ఆ పోస్ట్ చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతుందని చెప్పొచ్చు. దీంతో ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

photo credit -shruti haasan insta

కమల్‌ హాసన్‌, సారికలకు 1986లో జన్మించింది శృతి హాసన్‌. వీరి పెద్ద కూతురు. ఆమెకి చెల్లి అక్షర హాసన్‌ కూడా ఉంది. ఆమె కూడా సినిమాలు చేసింది. కానీ అక్కలా సక్సెస్‌ కాలేకపోయింది. ఇక శృతి హాసన్‌ ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో పడింది. లండన్‌ బేస్డ్ నటుడు మైఖేల్‌ కోర్సాలేతో డేటింగ్‌ చేసింది. 2019లో వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు.

దాదాపు ఏడాది పాటు ఖాళీగా ఉన్న శృతి 2020 లో శాంతను హజారికాతో ప్రేమలో పడింది. ఇటీవలే వీరిద్దరు కూడా బ్రేకప్‌ చెప్పుకున్నారు. ప్రస్తుతం సింగిల్ గానే ఉన్న శృతి హాసన్‌ నిజంగానే పెళ్లెప్పుడు చేసుకుంటుందో. ప్రేమ వివాహం చేసుకుంటుందా? అరెంజ్‌ మ్యారేజ్‌ చేసుకుంటుందా? అనేది చూడాలి. 

Read more:  లేడీ ఆర్టిస్ట్ లు అందంగా ఉంటే చాలు ఏఎన్నార్‌ పెట్టే కండీషన్‌ ఇదే, తనతో ఆ పాత్రలు చేయనిచ్చేవాడు కాదా?
 

Latest Videos

click me!