సురేఖ వాణి కూతురు సుప్రీత, ఎస్తర్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ `అమరావతికి ఆహ్వానం`. ఈ మూవీతో భయటపెట్టేందుకు వస్తున్నా గ్లామర్ గర్ల్స్. ఆ విశేషాలు ఏంటంటే?
సురేఖ వాణి సీనియర్ నటిగా రాణిస్తోంది. ఇప్పుడు ఆమెకి సినిమాలు తగ్గాయి, కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఆమె చేసే రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు అయితే తనకు సినిమాలు తగ్గినా, కూతురుని మాత్రం హీరోయిన్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆమె హీరోయిన్‌గా బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా `చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి` అనే మూవీ రూపొందుతుంది. దీంతోపాటు మరో హర్రర్ మూవీ `అమరావతికి ఆహ్వానం` చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా దీనికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.
24
హర్రర్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత
హర్రర్ థ్రిల్లర్‌గా `అమరావతికి ఆహ్వానం` చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సుప్రీతతోపాటు శివ కంఠమనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, హరీష్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో ధన్యబాలకృష్ణ యాక్షన్ అరాచకంలా ఉంది. భయపెట్టించేలా ఉంది.
34
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా `అమరావతికి ఆహ్వానం`
ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా గురించి హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ, ఇప్పటికే అనౌన్స్ చేసిన మా టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్ లోని పలు లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తి చేశాం. దర్శకుడు జీవికే తన విజన్ తో ఈ సినిమాకు మంచి ఔట్‌పుట్ తీసుకువచ్చారు. అన్ని పాత్రలకి ప్రాధాన్యత ఉండేలా మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నాయి. తప్పకుండా థియేటర్స్‌లో ప్రేక్షకులని సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్ అనుభూతినిస్తుంది. అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం` అని అన్నారు.
దర్శకుడు జివికె మాట్లాడుతూ , `ఈ మధ్య కాలంలో రిలీజైన అన్ని హారర్ సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే తరహాలో మరో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ కథాశంతో వస్తోన్న చిత్రం `అమరావతికి ఆహ్వానం`. మంచి ఆర్టిస్టులతో పాటు ఉత్కంఠభరితమైన కథ, కథనంతో ఈ సినిమా తెరకెక్కింది. సీనియర్ సినిమాటోగ్రాఫర్ జె ప్రభాకర్ రెడ్డి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ బరద్వాజ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్స్‌లో ఆడియెన్స్‌ని హారర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది` అని వెల్లడించారు. మొత్తంగా సుప్రీత ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాతో వచ్చే ఏడాది సందడి చేయబోతుందని చెప్పొచ్చు. అమర్ దీప్‌తో కలిసి నటిస్తున్న మూవీ కూడా వచ్చే ఏడాది ఆడియెన్స్ ముదుకు రాబోతుంది. ముందుగా `అమరావతికి ఆహ్వానం` విడుదల కాబోతున్న నేపథ్యంలో సుప్రీత హీరోయిన్‌గా ఎంట్రీతోనే భయపెట్టించబోతుండటం విశేషం.