కృష్ణంరాజు సినిమా కలెక్షన్స్ చూసి ఎన్టీఆర్ కి మైండ్ బ్లాక్.. సూపర్ స్టార్ కృష్ణ చేసిన పెద్ద మిస్టేక్ ఇదే

Published : Dec 29, 2025, 07:49 AM IST

సూపర్ స్టార్ కృష్ణ వదులుకున్న ఒక చిత్రం కృష్ణంరాజుకి ల్యాండ్ మార్క్ మూవీగా మారింది. ఆ సినిమా వసూళ్లు చూసి ఎన్టీఆర్ కూడా షాక్ అయ్యారట. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
కృష్ణంరాజు సినిమాలు

నందమూరి తారక రామారావు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోలు హవా చూపిస్తున్న టైంలో కృష్ణంరాజు కూడా తనదైన చిత్రాలతో రాణించారు. కృష్ణంరాజు నటించిన సినిమాల్లో కొన్ని మాస్ లో విపరీతమైన ఆదరణ పొందాయి. అందులో కటకటాల రుద్రయ్య సినిమా ఒకటి. కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించిన ఈ చిత్రం దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కింది.

25
షాకైన ఎన్టీఆర్

1978లో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 75 లక్షలకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో టాలీవుడ్ మొత్తాన్ని ఈ వసూళ్లు ఆశ్చర్యపరిచాయి. నందమూరి తారక రామారావు కూడా కటకటాల రుద్రయ్య సినిమా వసూళ్ల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారట. కటకటాల రుద్రయ్య సినిమా యూనిట్ ని ఎన్టీఆర్ అభినందించారు. ఈ చిత్రంతో కృష్ణంరాజుకి రెబల్ స్టార్ అనే బిరుదు మరింత పాపులర్ అయింది.

35
సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన సినిమా

అయితే వాస్తవానికి ఈ సినిమాలో హీరోగా నటించాల్సింది సూపర్ స్టార్ కృష్ణ అట. ప్రముఖ హీరో వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ అప్పట్లో నిర్మాతగా రాణించారు. కటకటాల రుద్రయ్య చిత్రానికి ఆయనే నిర్మాత. ఆయన ముందుగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణతో తీయాలని అనుకున్నారు. కృష్ణ కూడా ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.

45
కృష్ణ ఎందుకు మిస్ చేసుకున్నారు అంటే..

కానీ కృష్ణ అదే సమయంలో మరో నిర్మాతకి కమిట్మెంట్ ఇచ్చారు. దీనితో కృష్ణ.. వడ్డే రమేష్ కి చెబుతూ.. ఆల్రెడీ డేట్లు మరొకరికి ఇచ్చాను. కానీ ఒక షిప్ట్ లో కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ చేసి మరో షిఫ్ట్ లో ఆ సినిమా చేస్తాను అని చెప్పారు. కానీ దానికి వడ్డే రమేష్ అంగీకరించలేదు.

55
కృష్ణంరాజు కెరీర్ లో బిగ్ హిట్

దీనితో వడ్డే రమేష్.. కృష్ణంరాజుకి కథ చెప్పి ఆయన్ని హీరోగా ఫిక్స్ చేశారు. ఆ విధంగా కృష్ణ చేయాల్సిన కటకటాల రుద్రయ్య సినిమా కృష్ణంరాజుకి ల్యాండ్ మార్క్ మూవీగా మారింది. మొత్తానికి కృష్ణ ఈ చిత్రాన్ని వదులుకుని పెద్ద తప్పే చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories