ఎకో
మలయాళ భాషలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ Ekō, దర్శకుడు రమేష్ రూపొందించిన “Animal Trilogy”కి ముగింపు. మబ్బులతో కప్పబడిన కాట్టుకున్ను కొండ ప్రాంతంలో సాగే ఈ కథలో, అండర్‌కవర్ ఇన్వెస్టిగేటర్లు, పాత శత్రువులు, రహస్యాలు ఒకే చోట కలుస్తాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కల పాత్ర కథకు భయానకమైన మలుపులు ఇస్తుంది. రక్షణగా కనిపించే వ్యవస్థే ఎలా నియంత్రణగా మారుతుందన్న అంశాన్ని ఈ సినిమా బలంగా చూపిస్తుంది.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్: డిసెంబర్ 31, 2025
హక్
1985 షా బానో కేసు ఆధారంగా రూపొందిన కోర్ట్‌రూమ్ డ్రామా Haq. మహిళా హక్కులు, మతం, రాజ్యాంగ చట్టం మధ్య సంఘర్షణను ఈ సినిమా లోతుగా ఆవిష్కరిస్తుంది. యామి గౌతమ్ ధర్ నటించిన షాజియా బానో పాత్ర, తన హక్కుల కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు పోరాడుతుంది. వ్యక్తిగత బాధ ఒక జాతీయ చర్చగా ఎలా మారుతుందో ఈ చిత్రం చూపిస్తుంది. అత్యంత వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్: జనవరి 2, 2026
రన్ అవే
హార్లన్ కోబెన్ నవల ఆధారంగా రూపొందిన బ్రిటిష్ థ్రిల్లర్ సిరీస్ Run Away. డ్రగ్ అడిక్షన్‌తో బాధపడుతున్న కూతురిని కాపాడేందుకు ఒక తండ్రి ఎంతవరకూ వెళ్లగలడన్నదే కథ. నేర ప్రపంచం, రహస్య కుటుంబ నిజాలు, ప్రమాదకర పరిస్థితులతో ఈ సిరీస్ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచుతుంది.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్: జనవరి 1, 2026
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ( ఫైనల్ )
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న Stranger Things సిరీస్ ఫైనల్ ఎపిసోడ్. “Upside Down” అసలు రహస్యం బయటపడే ఈ చివరి అధ్యాయంలో హాకిన్స్ పట్టణం తుది యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. రెండు గంటల క్లైమాక్స్‌తో, 1983 నుంచి సాగిన ప్రయాణానికి భావోద్వేగ ముగింపు ఇవ్వనుంది.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్: జనవరి 1, 2026