అంతటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చిరంజీవి కోసం కృష్ణ ఎందుకు వదులుకున్నారో తెలుసా, డైరెక్టర్ కి ఇష్టంలేని టైటిల్

First Published | Oct 7, 2024, 1:34 PM IST

మొదట టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఏఎన్నార్ హవా.. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు ఆధిపత్యం.. వీళ్ళ తర్వాత ఇండస్ట్రీని, ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో సూపర్ స్టార్ కృష్ణ ధాటిని ఎవరూ తట్టుకునే వారు కాదు.

మొదట టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఏఎన్నార్ హవా.. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు ఆధిపత్యం.. వీళ్ళ తర్వాత ఇండస్ట్రీని, ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో సూపర్ స్టార్ కృష్ణ ధాటిని ఎవరూ తట్టుకునే వారు కాదు. కృష్ణ వేగంగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొట్టారు. ఆ సమయంలో కృష్ణకి చిరంజీవి నెమ్మదిగా పోటీ ఇస్తూ వచ్చారు. 

ఖైదీ తర్వాత ఇక చిరంజీవి హవా మొదలైంది. చిరంజీవి, కృష్ణ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అదే సాన్నిహిత్యాన్ని ఇప్పుడు మహేష్ బాబు, రాంచరణ్ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా 1987లో సూపర్ స్టార్ కృష్ణ తాను చేయాల్సిన ఒక చిత్రాన్ని చిరంజీవి కోసం వదులుకున్నారు. ఆ మూవీ ఏకంగా ఇండస్ట్రీ అయి అన్ని రికార్డులని తుడిచిపెట్టేసింది. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో ఒకటైన పసివాడి ప్రాణం చిత్రాన్ని ముందుగా కృష్ణ చేయాలనుకున్నారు. 


హాలీవుడ్ లో వచ్చిన విట్నెస్ చిత్రం ఆధారంగా మలయాళంలో పోవును పుతియా పాంథేన్నల్ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని విజయ బాపినీడు కథ సిద్ధం చేసుకున్నారు. కృష్ణతో ఈ చిత్రాన్ని చేయాలనేది ఆయన ప్లాన్. కృష్ణకి కథ చెబితే ఒకే అన్నారు. చిన్నపిల్లాడి పాత్ర కోసం మహేష్ బాబుని అనుకున్నారు. ఇంతలోగా చిరంజీవి, కోదండరామిరెడ్డి, అల్లు అరవింద్ కాంబినేషన్ లో పసివాడి ప్రాణం చిత్రానికి అనౌన్స్ మెంట్ వచ్చింది. చిరంజీవి నుంచి ప్రకటన రావడంతో కృష్ణ ఈ చిత్రాన్ని పక్కన పెట్టేశారు. 

Also Read : స్టార్ హీరోతో ప్రముఖ క్రీడా కారుడి భార్య ఎఫైర్.. ఏకంగా బెడ్ రూమ్ లో చూశానంటూ, అది నిజమే అంటూ ఒప్పుకున్న నటి

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసింది ఈ చిత్రంతోనే. సంగీత దర్శకుడు చక్రవర్తి అందించిన చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ అనే సాంగ్ యువతని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రంలో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజిత పసివాడి ప్రాణం చిత్రంలో చిన్న పిల్లాడిగా నటించింది. ఆ పిల్లాడి పాత్ర చుట్టూనే కథ మొత్తం సాగుతుంది. విజయశాంతి, చిరంజీవి మరోసారి అద్భుతంగా కెమిస్ట్రీ పండించిన చిత్రం ఇది. 

ఈ చిత్రం ప్రారంభానికి ముందే చిరంజీవికి మాస్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. కానీ ఈ మూవీ ఏమో పిల్లాడి చుట్టూ ఉంటుంది. సినిమాలో మాత్రం ఫ్యాన్స్ కావాల్సిన పాటలు, ఫైట్స్, రొమాన్స్ అన్ని ఉన్నాయి. చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లుగా మాస్ టైటిల్ దొరకడం లేదు. దాదాపు రిలీజ్ టైం దగ్గరపడే వరకు సస్పెన్స్ కొనసాగింది. కొన్ని మాస్ టైటిల్స్ అనుకున్నారు. అవి చిరంజీవికి నచ్చలేదు. చివరికి పసివాడి ప్రాణం అనే టైటిల్ దగ్గర అందరి మధ్య చర్చ జరిగింది. ఈ టైటిల్ కోదండ రామిరెడ్డికి అసలు నచ్చలేదు. 

ఒకవైపు రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో.. నేను టైటిల్ డిజైన్ చేయిస్తాను అప్పటికీ బాగాలేకుంటే ఆలోచిద్దాం అని అన్నారట. పసివాడి ప్రాణం టైటిల్ ని డిజైన్ చేయించారు. డిజైన్ అద్భుతంగా ఉంది కానీ టైటిల్ విషయంలో తనకి ఇంకా అనుమానాలు ఉన్నాయి అని కోదండ రామిరెడ్డి అన్నారట. కానీ అదే టైటిల్ తో సినిమా రిలీజ్ చేశారు. అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డులు అన్నీ దాటేసి ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం అవతరించింది. 

Latest Videos

click me!