సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి చాలా రూమర్స్ వస్తుంటాయి. కొన్ని రూమర్స్ నిజమైనప్పటికీ సదరు సెలెబ్రిటీలు ఏమీ లేదు అన్నట్లుగా ఖండిస్తారు. కొన్ని రూమర్స్ అవాస్తవాలుగానే మిగిలిపోతాయి. కొన్ని సందర్భాల్లో సెలెబ్రిటీలే తమ పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ గా చెబుతుంటారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్, బ్రేకప్ లు జరిగితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హాలీవుడ్ లో డేటింగ్, లవ్, బ్రేకప్ లాంటి విషయాలు సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఎఫైర్ వార్తలు సంచలనం అవుతుంటాయి. తాజాగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తన పర్సనల్ లైఫ్, మాజీ భార్య గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. మైక్ టైసన్ తన మాజీ భార్య రాబిన్ గివెన్స్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.