మహేశ్‌ వద్దన్న కథను అలీ తో తీసి సూపర్ హిట్,షాకింగ్ ట్రూత్

First Published | Oct 7, 2024, 12:11 PM IST

నిజంగా మహేష్ ఆ సినిమా  చేసి ఉంటే అలీ కి సూపర్ హిట్   కెరీర్ లో మిస్సయ్యేది. అయితే ఆ కథను మహేష్ బాబు చేస్తే ఎలా రిసీవ్ చేసుకునేవారు అనేది ఆశ్చర్యకరమైన విషయం.

ali, yamaleela, Mahesh Babu, krishna,


ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న మరో హీరోతో చేయటం కొత్తమీ కాదు.  అయితే హీరోతో అనుకున్న కథను ఓ కమిడియన్ తో తీసి హిట్ కొట్టడం మాత్రం ఆశ్చర్యమే. మహేష్ బాబు కెరీర్ లో రిజెక్ట్ చేసిన కథలు బయిట వేరే హీరోలతో సక్సెస్ ఇచ్చిన దర్శకులు ఉన్నారు. అయితే ఇలాంటి విచిత్రమైతే చోటు చేసుకోలేదు.

ఇప్పటికి ఈ విషయం ఇండస్ట్రీలో ఆశ్చర్యంగా చెప్పుకుంటూంటారు. నిజంగా మహేష్ చేసి ఉంటే అలీ కి సూపర్ హిట్ సినిమా కెరీర్ లో మిస్సయ్యేది. అయితే ఆ కథను మహేష్ బాబు చేస్తే ఎలా రిసీవ్ చేసుకునేవారు అనేది ఆశ్చర్యకరమైన విషయం.

ali, yamaleela, Mahesh Babu, krishna,


సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న  క్రేజ్ , ఇమేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అసలు పాన్ ఇండియా మూవీ చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవటం విశేషం. సీనియర్ హీరో కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.


ali, yamaleela, Mahesh Babu, krishna,


అలాగే మహేష్ కథల ఎంపిక కూడా బాగుంటుంది. తన ఇమేజ్ కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటారు. బోయపాటి శ్రీను వంటి దర్శకులు వచ్చినా మొహమాటం లేకుండా ఆ యాక్షన్ కథలు తనకు సరిపడవని ప్రక్కన పెట్టేసారు. ఫ్యామిలీలకు నచ్చి, కుర్రాళ్లకు ఎక్కే కథలు మహేష్ కు ఇష్టం. అందుకే  మహేష్ కెరీర్ లో ఎన్నో గుర్తుపెట్టుకోదగ్గ, అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. డిఫరెంట్ కథలతో.. వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించాడు. అలరిస్తున్నాడు.


ఇక  బాలనటుడిగా అనేక చిత్రాల్లో అలరించిన మహేష్.. రాజకుమారుడు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1999 జూలై 30న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. హీరోగా తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు మహేష్.

ఇందులో మహేష్ సరసన ప్రీతి జింటా కథానాయికగా నటించగా.. మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన రాజకుమారుడు మూవీ కు ముందు నిజానికి వేరే సినిమా చేయాల్సిన ఆఫర్ వచ్చింది. అయితే కృష్ణగారు ఆ కథను ప్రక్కన పెట్టడంతో ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. అయితే ఆ కథని అలీతో తీసి హిట్ కొట్టారు.  ఆ సినిమా ఏంటి..దాని వెనక ఏం జరిగిందో చూద్దాం.


 
ఆ సినిమా మరేదో కాదు.. చిన్న చిన్న వేషాలు, హాస్య పాత్రలు పోషిస్తున్న అలీని హీరోని చేసి, ఆయన కెరీర్‌ను సరికొత్త మలుపు తిప్పిన చిత్రం ‘యమలీల’. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో, అద్భుతమైన కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసారు.

 ఈ సినిమాలో మొదట హీరోగా అనుకున్నది అలీ కాదు.. మహేశ్‌ బాబు. అప్పటికి ఆయన హీరోగా పరిచయం కాలేదు. రాకుమారుడు చిత్రం రాలేదు. అందుకే అప్పుడు ఫామ్ లో ఉన్న కృష్ణారెడ్డి తను మహేశ్‌ను హీరోగా పరిచయం చేసే అవకాసం తీసుకోవాలనకున్నారు. ఆ వెంటనే ఓ కథ రెడీ చేసి  హీరో కృష్ణకు కథ చెప్పారు. ఆయనకు నచ్చింది కూడా. అందులో కృష్ణ స్పెషల్ సాంగ్ కూడా డిజైన్ చేసారు.  అయితే అది పట్టాలు ఎక్కలేదు. 
 


అప్పుడు ఆ కథని ఎవరిని హీరోగా పెట్టి తీద్దామా అని ఆలోచించి అలీ తో తీసేసి సూపర్ హిట్ కొట్టారు.   మహేశ్‌బాబుతో తీద్దామనుకున్న కథలో మార్పులు చేసి.... అలీతోచేసారు. ఆ సినిమానే ‘యమలీల’. ఆ  చిత్రానికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ చేసిన స్పెషల్‌ సాంగ్‌.  ఇక యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం, విలన్‌గా తనికెళ్ల భరణి, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా కోట శ్రీనివాసరావు.. ఇలా సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షుకుల్ని అలరించింది. 


ఇక ఈ విషయమై అలీ మాట్లాడుతూ.. "మాయలోడు ఆడియో ఫంక్షన్‌లో ఓ సాంగ్‌కు డ్యాన్స్‌ చేశా. అనుకోకుండా కృష్ణారెడ్డిగారు చూశారు. ఒకరోజు నాకు చెక్‌ ఇచ్చి, అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. ఎక్కువ రోజులు షూటింగ్‌ చేయాల్సి ఉంటుందేమోనని అనుకున్నా.ఆ తర్వాత హీరో నేనని తెలిసింది.

అసలు ఈ సినిమాకు హీరో మహేశ్‌బాబు. కృష్ణగారికి కూడా కథ నచ్చింది. అయితే, 'రెండు మూడేళ్లు ఆగండి. మహేశ్‌ చదువుకుంటున్నాడు' అన్నారట. అయితే, కృష్ణారెడ్డిగారు ఎగ్జైట్‌మెంట్‌ ఆపుకోలేక నన్ను తీసుకున్నారు. మనీషా బ్యానర్‌లో నటించాలని అందరూ అనుకుంటారు." నేను నాలుగు సినిమాలు హీరోగా చేశా. నేను హీరోను అవుతానని జీవితంలో అనుకోలేదు. రాజబాబుగారిలా కమెడియన్‌ అవుదామనుకున్నానంతే". అని ఆలీ తన మనసులో మాట చెప్పారు.

Mahesh Babu


అయితే మహేష్ తో యమలీల సినిమా వద్దనటానికి కారణం ..అది కామెడీ సెంటిమెంట్ కలిసిన కథ కావటమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తన కొడుకు లాంచింగ్ కామెడీ సినిమాతో చేస్తే తర్వాత అలాంటి ఆఫర్స్ వచ్చి కామెడీ సినిమాలు చేయాల్సి వస్తుందని, అలా కాకుండా నవరసాలు కలిసి కథ, అదీ హీరోయిజం, రొమాన్స్ ఉండేది అయితే తనలా స్టార్ గా నిలబడచ్చు అనుకున్నారట సూపర్ స్టార్ కృష్ణ. అదే జరిగింది. ఈ రోజు సూపర్ స్టార్ గా మహేష్ బాబు వెలుగుతున్నారు. 
 


ఇక అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ‘యమలీల’ ఎవరూ ఊహించని విజయం సాధించింది. ఎంత పెద్ద హిట్‌ అంటే 1994 ఏప్రిల్‌ 14న బాలకృష్ణ నటించిన జానపదం ‘భైరవ ద్వీపం’ విడుదల అయింది. వారం తర్వాత అంటే ఏప్రిల్‌ 20న నాగార్జున తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ‘హలో బ్రదర్‌’ రిలీజ్‌ అయింది. ఈ రెండు చిత్రాలూ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఏప్రిల్‌ 28న విడుదలైన ‘యమలీల’ ఆ రెండు భారీ చిత్రాలతో పోటీ పడి, ఘన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2014లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘యమలీల 2’ మాత్రం సక్సెస్‌ కాలేదు

Latest Videos

click me!