సూపర్‌స్టార్‌ కృష్ణ లైఫ్‌ని తలక్రిందులు చేసిన ఇండస్ట్రీ హిట్‌ మూవీ ఏంటో తెలుసా? ఆ దెబ్బతో నిర్మాతలంతా పరార్‌

Published : Sep 09, 2025, 05:26 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ తనకు ఇండస్ట్రీ హిట్‌ అందించిన సినిమా కారణంగా ఆయన కెరీరే తలక్రిందులైంది. ఏకంగా 17 సినిమాలు పరాజయం చెందాయి. 

PREV
15
సూపర్‌ స్టార్‌ కృష్ణకి వరుసగా 17 సినిమాలు పరాజయం

సూపర్‌ స్టార్‌ కృష్ణ మాస్‌ కమర్షియల్‌ హీరోగా ఎదిగారు. కొన్ని పౌరాణిక మూవీస్‌, పౌరాణిక పాత్రలు చేసినా, ఆయనకు గుర్తింపు తెచ్చింది మాత్రం కమర్షియల్‌ యాక్షన్‌ మూవీస్‌ అనే చెప్పాలి. అంతో ఇంతో ఫ్యామిలీ చిత్రాలతోనూ అలరించారు. అయితే ఓ హిస్టారికల్‌ మూవీ సూపర్‌ స్టార్‌ కృష్ణ కెరీర్‌ని తలక్రిందులు చేసింది. ఆ దెబ్బతో వరుసగా 17 సినిమాలు ఫ్లాప్‌. ఆయనతో సినిమా నిర్మించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆ కథేంటో చూస్తే.

25
`అల్లూరి సీతారామరాజు` మూవీతో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ హిస్టారికల్‌ కథాంశంతో `అల్లూరి సీతారామరాజు` మూవీ చేశారు. ఇది స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి జీవితాన్ని బేస్‌ చేసుకుని రూపొందించారు. వీ రామచంద్రరావు దర్శకుడు. కృష్ణతోపాటు జి హనుమంతారావు   నిర్మించారు. 1974లో మే 1న ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీని మొదట ఎన్టీఆర్‌ చేయాలనుకున్నారు. కానీ జనాలు చూడరనే సందేహంతో ఆయన వెనక్కి తగ్గారు. కృష్ణ ఈ మూవీ చేస్తున్నారని తెలిసి కూడా ఆ మూవీని చేయోద్దు, జనం చూడరని చెప్పారట. అయినా డేరింగ్‌తో చేశారు కృష్ణ. ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నారు.

35
`అల్లూరి సీతారామరాజు` తర్వాత వరుసగా 17 సినిమాలు ఫ్లాప్‌

ఈ సినిమాతో కృష్ణ కెరీర్‌ మారిపోయింది. ఆయన ఇమేజ్‌ పీక్‌లోకి వెళ్లింది. తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఒక్కటి కూడా ఆడలేదు. వరుసగా 17 సినిమాలు పరాజయం చెందాయి. దీంతో చాలా మంది నిర్మాతలు నష్టపోయారు. ఆ తర్వాత ఆయనతో సినిమాలు చేసేందుకు ఏ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. ఇక కృష్ణ పని అయిపోయిందనుకున్నారు అంతా. `అల్లూరి సీతారామరాజు`గా కృష్ణని చూసిన జనం మిగిలిన పాత్రల్లో చూడలేకపోయారు. అంతటి పవర్‌ఫుల్‌ పాత్ర జనంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

45
కృష్ణ పని అయిపోయిందన్నారు

దీంతో ఆడియెన్స్ కి మిగిలిన సినిమాలు ఎక్కలేదు. అవి పరాజయం చెందాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 సినిమాలు పరాజయం చెందడంతో నిర్మాతలు కూడా భయపడ్డారు. ఆయనతో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. అలా `అల్లూరి సీతారామరాజు` తో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న కృష్ణకి అదే పెద్ద దెబ్బగా మారింది. ఆయన కెరీర్‌నే తలక్రిందులు చేసింది. ఆ తర్వాత కృష్ణ పని అయిపోయిందనే దశకు వెళ్లింది.

55
సొంతంగా నిర్మాతగా మారిన కృష్ణ

ఆ తర్వాత కృష్ణ  నిర్మాతగా మారి పద్మాలయ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌ని స్థాపించి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు నిర్మాతగా `పాడిపంటలు` అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. దీంతో కృష్ణ కెరీర్‌ బౌన్స్ బ్యాక్‌ అయ్యింది. ఆయన కెరీర్‌ పరుగులు పెట్టింది. ఆ తర్వాత ఆయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు క్యూ కట్టారు. కానీ కృష్ణ మాత్రం ఎవరితోనూ మూవీ చేయలేదు. తన బ్యానర్‌లోనే సినిమాలు నిర్మించారు. విజయాలు అందుకున్నారు. అలా దాదాపు 15ఏళ్లపాటు సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేశారు కృష్ణ. తనని తిరస్కరించిన వారికి అదే రేంజ్‌లో ఝలక్‌ ఇచ్చారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories