తన ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఎవ్వరూ వాడకుండా చూడాలంటూ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా మార్ఫింగ్ ఫోటోలు, అశ్లీల వీడియోలు సర్క్యులేట్ కాకుండా చూడాలని కోరుతున్నారు.
Aishwarya Rai : ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ బిడ్డకు తల్లి అయినా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు... దీంతో యువత ఇప్పటికీ ఐశ్వర్యారాయ్ ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే ఆమెపై యువత చూపించే అభిమానాన్ని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఐశ్వర్యారాయ్ సాధారణ ఫోటోలనే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),డీప్ ఫేక్ వంటి టెక్నాలజీని ఉపయోగించి అశ్లీల ఫోటోలు, వీడియోలను సృష్టిస్తున్నారు. ఇటీవలకాలంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
25
తన ఫోటోలు, వీడియోలపై కోర్టుకు ఐశ్వర్యారాయ్
అయితే తనకు సంబంధంలేని అశ్లీల మార్ఫింగ్ వీడియో, ఏఐ ఫోటోలతో విసిగిపోయిన ఐశ్వర్యారాయ్ ఏకంగా కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలు, వీడియోలు ఉపయోగించుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని డిల్లీ హైకోర్టును కోరారు. ఈమె పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఫోటోలు, వీడియోలు వాడకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇలా జస్టిస్ తేజస్ కరియా నిర్ణయంతో ఐశ్వర్యారాయ్ కి కాస్త ఊరట లభించింది.
35
ఐశ్వర్యారాయ్ పేరుతో అశ్లీల మార్పింగ్ వీడియోలు
ఐశ్వర్యారాయ్ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల వ్యవహారంపై న్యాయవాది సందీప్ సేథి కోర్టులో వాదించారు. ఆమె చిత్రాలనే కాదు పోలికలను కూడా ఉపయోగించుకునేందుకు ఎవరికీ హక్కు ఉండదని న్యాయవాది పేర్కొన్నారు. చివరికి కొందరు ఐశ్వర్యారాయ్ పేరును, మార్ఫింగ్ ఫోటోలను, ఆమెను పోలివున్న వీడియోలను లైంగిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారని… ఇది అతి దారుణమని న్యాయవాది సేథ్ పేర్కొన్నారు.
తన పరువును, ప్రైవసీకి భంగం కలిగించే ఫోటోలు, వీడియోలను ఐశ్వర్యారాయ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు, ఫోటోలు వాడుతున్నవారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇకపై వీటిని వాడకుండా చూడాలని ఐశ్వర్యారాయ్ కోరుతున్నారు. మరీముఖ్యంగా అశ్లీల ఏఐ ఫోటోలు, డీప్ ఫేక్ వీడియోలపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె అభ్యర్థనపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
55
డిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యారాయ్ తరపున అడ్వోకేట్స్ ప్రవీణ్ ఆనంద్, ద్రువ్ ఆనంద్ వాదనలు వినిపించారు. డిల్లీ హైకోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది 2026, జనవరి 15 కు వాయిదా వేసింది. అప్పటివరకు ఐశ్వర్యారాయ్ ఫోటోలను అభ్యంతకరంగా వాడకుండా ఆదేశాలు జారీ చేయనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.