Janaki Kalaganaledu: మల్లిక ప్లాన్ రివర్స్.. గుడిలో జ్ఞానాంబను అవమానించిన సునంద?

Published : Nov 28, 2022, 12:33 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 28 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
16
Janaki Kalaganaledu: మల్లిక ప్లాన్ రివర్స్.. గుడిలో జ్ఞానాంబను అవమానించిన సునంద?

 ఈరోజు ఎపిసోడ్లో జానకి రామచంద్ర గారు నేను దీపాలు నీటిలో వదలబోతున్నాను ఏమైనా కోరిక ఉంటే కోరుకోండి అని అనగా మీరు ఐఏఎస్ కావాలి మీ  కల నెరవేరాలి అని అనగా వెంటనే జానకి తీరని కలల గురించి ఎప్పుడు ఆలోచించకండి అని అంటుంది. అప్పుడు మల్లిక నాది ఫేక్ ప్రెగ్నెన్సీ అని ఆ పోలేరమ్మకు తెలియకుండా చూడు స్వామి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర మన పెళ్లికి ముందు నేను ఇలా నీటిలో దీపాలు వెలుగుతున్నప్పుడు గుడికి వచ్చాను ఈ దేవతను చూశాను. అప్పుడు మీ అందమైన ముఖాన్ని చూశాను. ఈ దేవత పక్కన నిలబడే అవకాశం దొరుకుతుందా అనుకున్నాను.
 

26

కానీ ఆరోజు అది తీరని కోరిక కానీ దేవుడు నా కోరిక విని నా కోరికను తీర్చాడు అని అంటాడు రామచంద్ర. ఆ తర్వాత జానకి మల్లిక జెస్సి అందరూ కలిసి నీటిలో దీపాలు వదులుతారు. ఇప్పుడు మల్లిక ఎలా అయినా జానకి వదిలిన దీపాలు ఆర్పాలనుకుంటూ ఆయన దీపాల మీద నీటిని చల్లుతూ ఉంటుంది. అప్పుడు పనిమనిషి చికిత అమ్మగారు మీరు అలా చేస్తే జానకి అమ్మగారు దీపాలు ఆరిపోతాయి అని అనగా నువ్వు నోరు మూసుకోవే అని అంటుంది. అప్పుడు జానకి మల్లిక వైపు చూస్తుంది. అప్పుడు మల్లిక ప్లాన్ రివర్స్ అవుతుంది. జానకి దీపాలకు బదులుగా మల్లిక పెట్టిన దీపాలే మునిగిపోయి ఆరిపోయి ఉంటాయి.
 

36

అప్పుడు మల్లిక వైపు జానకి కోపంగా చూడగా మల్లిక గుటకలు మిగుతూ ఉంటుంది. మరొకవైపు జ్ఞానాంబ వాళ్ళు పూజ కోసం అన్ని ఏర్పాటు చేసి కొడుకు కోడళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు అందరూ మౌనంగా ఉండి బాధగా ఉండడంతో వెంటనే గోవిందరాజులు ఏం జరిగింది అని అడగగా అప్పుడు పనిమనిషి చికిత జరిగింది మొత్తం చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ దంపతులు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు గోవిందరాజు దంపతులు జ్ఞానాంబ సీరియస్ అవుతారు. ఇకపై నువ్వు నీ తింగరి తనాన్నీ తగ్గించుకో అని అంటారు.
 

46

 గుడి కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను కనీసం హోమం దగ్గరైన భక్తిశ్రద్ధలతో కూర్చో అని అంటుంది జ్ఞానాంబ. తర్వాత అందరూ కలిసి పూజ మొదలుపెడతారు. అప్పుడు మల్లిక దిగులుగా  కూర్చుని ఉండగా వెంటనే జ్ఞానాంబ నువ్వు ఏమి బాధపడకు మల్లిక రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి స్కానింగ్ చేయిద్దాము అని అంటుంది. అది విన్నా మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడికి వెళ్తే కడుపులో బిడ్డ ఎలా ఉన్నారో క్షేమంగా ఉన్నారో లేదో మాకు తెలుస్తుంది అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు మల్లికా హాస్పిటల్ కి వెళ్తే అసలు కడుపులో బిడ్డ లేదని చెబుతారు అప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

56

గోవిందరాజులు అమ్మ మల్లిక ఎందుకు భయపడుతున్నావు అని అనగా బయటపడిపోతుందేమోనని వణికి పోతుంది మావయ్య గారు అని అంటుంది జానకి. అప్పుడు రామచంద్ర బయటపడిపోవడమేంటి జానకి గారు అని అనడంతో జానకి అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. ఇంతలోనే సునంద అక్కడికి వచ్చి జ్ఞానాంబ  కుటుంబాన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి వీళ్లను ఎలా అయినా బాధ పెట్టాలి అనుకుంటూ అక్కడికి వెళుతుంది సునంద. అప్పుడు సునంద నన్ను కూడా ఒక మాట పిలవచ్చు కదా జ్ఞానాంబ అని అంటుంది.
 

66

ఇప్పుడు సునంద కావాలని అఖిల్ విషయం గురించి ప్రస్తావిస్తూ అందరి ముందు జ్ఞానాంబ బరువు తీయాలని చూస్తుంది. అప్పుడు జ్ఞానాంబ మౌనంగా ఉండడంతో సునంద నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటుంది. చిన్న కోడలు అలాగే మొన్న పెళ్లయిన కోడలు ఇద్దరు గర్భవతులు అందుకే పెద్ద కోడలితో కాకుండా వారిద్దరితో పూజ చేయిస్తుంది అంటూ పక్కవారితో చెబుతూ ఉంటుంది సునంద. అప్పుడు మల్లిక ఏంటి భగవంతుడా నాకు ఎక్కడ చూసినా నా ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడుకుంటున్నారు బయటపడితే ఇక అంతే సంగతులు అని మల్లిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనె జానకి అక్కడికి వస్తుంది.

click me!

Recommended Stories