Bigg Boss Telugu 6
బిగ్ బాస్ సీజన్ 6 మరో మూడు వారాల్లో ముగియనుంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్లో 8 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ఇక 12వ వారం కంటెస్టెంట్ రాజశేఖర్ అలియాస్ రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఫైమా,రాజ్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ పాస్ తో ఫైమా సేవ్ అయ్యింది.
రాజ్ ఎలిమినేషన్ విమర్శలకు దారి తీసింది. నామినేషన్స్ లో ఉన్న సభ్యులలో తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని మాత్రమే ఎలిమినేట్ చేయాలన్నబేసిక్ రూల్ బ్రేక్ చేశారు. ఫైమా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న రాజ్ ని ఎలా ఎలిమినేట్ చేస్తారని ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 లో సేమ్ సిట్యుయేషన్ అరియనా, అవినాష్ కి ఎదురైంది. అప్పుడు ఫైమా మాదిరి అవినాష్ ఎవిక్షన్ పాస్ తో ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యాడు. అవినాష్ కంటే ఎక్కువ ఓట్లు అరియనాకు రావడంతో ఆమె కూడా సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
Bigg Boss Telugu 6
మూడు వారాల్లో నలుగురు కంటెస్టెంట్స్ ని ఇంటికి పంపాల్సి ఉండగా.. అడ్డదిడ్డంగా ఎలిమినేట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ అత్యధికంగా 21 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయ్యింది. దీంతో ఎలిమినేషన్స్ కి 14 వారాలు సరిపోవడం లేదు. ఇప్పటికే రెండు సార్లు డబుల్ ఎలిమినేషన్ కి పాల్పడ్డారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది.
Bigg Boss Telugu 6
ఇక రాజ్ మోస్ట్ జెన్యూన్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇంటి సభ్యులతో పాటు ఆడియన్స్ అతనిపట్ల మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు. గత ఐదు సీజన్స్ లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చి కంటెస్టెంట్ గా రాజ్ నిలిచిపోయాడు. అతనికి ఘన స్వాగతం లభించింది.
Bigg Boss Telugu 6
కాగా 12 వారాలున్న రాజ్ రెమ్యూనరేషన్ గా తీసుకున్న అమౌంట్ లీకైంది. అందుతున్న సమాచారం ప్రకారం వారానికి రూ. 1.40 లు ఒప్పందంపై హౌస్లోకి వెళ్ళాడట. ఆ లెక్కన రాజ్ రూ. 16.8 లక్షలు అందుకున్నాడట. దీని పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.