ఈ రోజు ఎపిసోడ్లో తులసి మీరు మామయ్యని ప్రేమిస్తున్నారే అంతకంటే ఎక్కువగానే నేను ప్రేమిస్తున్నాను అందుకే ఆ క్షణంలో ఏది అనిపించిందే అది చేశాను అని అనగా వెంటనే లాస్య ఇదంతా మామయ్య బర్త్ డే రోజు ఎందుకు జరిగింది జరిగేలా నువ్వే ప్లాన్ చేశావు అని నిందలు వేస్తుంది లాస్య. ఈ ఇంట్లో అందరూ దిగులుగా ఉండేలా చేసి మీ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నావు అత్తయ్య ను రెచ్చగొట్టి మావయ్యని మీదికి ఉసుగొలుపావు అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది లాస్య. అప్పుడు వెంటనే తులసి సీరియస్ అవుతూ బాగానే మాట్లాడుతున్నావు లాస్య ఒక రచయిత్రి లాగా ఇప్పటికిప్పుడు బాగానే కథను అల్లావు అని అనగా ఇది కథ కాదు అని అనడంతో మరేంటి అని అంటుంది తులసి. అప్పుడు లాస్య నోరు ఉంది కదా అని మాట్లాడితే నిజాలు అబద్ధాలు కావు అని అంటుంది.