మా తాత ఏఎన్నార్, మావయ్య నాగార్జున కంటే ఆ హీరోలే నాకు ఎక్కువ ఇష్టం.. తండ్రీ కొడుకులపై సుమంత్ వ్యాఖ్యలు

Published : Nov 06, 2025, 04:53 PM ISTUpdated : Nov 06, 2025, 05:12 PM IST

హీరో సుమంత్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన నటుడు. ఏఎన్నార్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ సుమంత్ కి తన తాత కంటే మరో స్టార్ హీరోనే ఎక్కువ ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

PREV
15
ఏఎన్నార్ మనవడిగా ఎంట్రీ

హీరో సుమంత్ ఒక దశలో వరుస విజయాలు అందుకున్నారు. ఆయన నటించిన ప్రేమ కథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగా రాణించేవి. సత్యం, గోదావరి, మహానంది, గౌరి లాంటి చిత్రాలతో సుమంత్ విజయాలు అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా సుమంత్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అయితే క్రమంగా సుమంత్ కి పరాజయాలు ఎక్కువ కావడంతో సినిమాలు బాగా తగ్గిపోయాయి.

25
అక్కినేని ఫ్యామిలీ హీరోలు

అక్కినేని ఫ్యామిలిలో ఏఎన్నార్ తర్వాత నాగార్జున, ఆ తర్వాత సుప్రియ, సుమంత్ నటులుగా పరిచయం అయ్యారు. ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్, సుశాంత్ కూడా టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్నారు. తన ఫ్యామిలీ హీరోలపై సుమంత్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
మా తాత కంటే ఆయనే నాకు ఎక్కువ ఇష్టం

తన ఫ్యామిలీ హీరోల కంటే తనకు మరో ఇద్దరు హీరోలంటేనే ఎక్కువ ఇష్టం అని సుమంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నాకు చిన్నప్పటి నుంచి మా తాత కంటే సూపర్ స్టార్ కృష్ణ అంటే బాగా ఇష్టం. ఈ విషయం మా తాత అడిగినప్పుడు చెప్పడానికి భయపడేవాడిని. అందుకే కృష్ణ గారు అని చెప్పకుండా అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం అని చెప్పేవాడిని. హిందీలో నాకు అమితాబ్ అంటేనే ఇష్టం అని సుమంత్ తెలిపారు.

45
ఎలాంటి డౌట్ లేకుండా మహేష్ అంటేనే ఇష్టం

ఇప్పుడు మాత్రం నాకు ఎలాంటి డౌట్ లేకుండా మహేష్ బాబు అంటే ఇష్టం అని చెబుతాను. మా మావయ్య నాగార్జున, అఖిల్, నాగార్జున ముగ్గురూ ఎదురుగా ఉన్నా నేను ఈ విషయం ధైర్యంగా చెబుతాను. నాకు మా ఫ్యామిలీ హీరోల కంటే మహేష్ బాబు అంటేనే ఇష్టం అని సుమంత్ తెలిపారు.

55
రాంగ్ డెసిషన్స్ వల్లే ఫ్లాపులు

తాను సినిమా కెరీర్ ప్రారంభించిన తర్వాత సత్యం మూవీ వరకు ప్రతి సినిమా విషయంలో మావయ్య నాగార్జున గారి సలహాలు తీసుకునేవాడిని. ఆ తర్వాత నేను ఓన్ గా డెసిషన్స్ తీసుకోవడం ప్రారంభించినట్లు సుమంత్ తెలిపారు. కొన్ని సినిమాల విషయంలో రాంగ్ డెసిషన్స్ వల్ల ఫ్లాపులు ఎదుర్కొన్నాని సుమంత్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories