ఎన్ని కోట్లు ఇచ్చినా నటించను, బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సూపర్ స్టార్ సినిమా ఏదో తెలుసా?

Published : Nov 06, 2025, 04:37 PM IST

ఇండియాన్ సూపర్ స్టార్ నటించిన ఒక సినిమాను బాలయ్య రిజెక్ట్ చేశాడు. ఎన్ని కోట్లు ఇచ్చినా... ఆ సినిమాను మాత్రం చేయను అన్నాడట. ఇంతకీ ఆ మూవీ ఏంటి? బాలకృష్ణ ఎందుకు నటించలేదు. ?

PREV
14
దుమ్మురేపుతోన్న బాలయ్య..

ప్రస్తుతం బాలయ్య దుమ్మురేపుతున్నాడు.. వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే 4 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బాలకృష్ణ, మరో రెండు సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అఖండ2 ని అభిమానుల మందుకు తీసుకురాబోతున్నాడు నటసింహం. అదే ఏడాది మలినేని గోపీచంద్ సినిమాతో సందడి చేయబోతున్నాడు 65 ఏళ్ల సీనియర్ హీరో. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే.. డబుల్ హ్యాట్రిక్ తో బలయ్య సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాట్టే. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో బాలయ్య ఈలోపు ఓసినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో పవర్ ఫుల్ గెస్ట్ రోల్ కు బాలకృష్ణ నో చెప్పారట. దానికి కారణం ఏంటో తెలుసా?

24
74 ఏళ్ల వయస్సులో రజినీకాంత్ రచ్చ..

సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళంతో పాటు.. సౌత్ ఇండియాయ మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 74 ఏళ్ల వచ్చినా.. ఏమాత్రం తగ్గని ఆయన స్టైలే చాలా ప్రత్యేకం. ఇప్పటికీ 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ హీరో.. ఎంత ఆస్తి ఉన్నా.. సింప్లిసిటీతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక రజినీకాంత్ నటించిన చివరి సినిమా 'కూలీ' భారీ అంచనాలతో విడుదలై, అనుకున్నంత విజయం సాధించలేదు. కథను అద్భుతంగా తీర్చిదిద్దే లోకేష్ ఈసారి తడబడ్డాడు. చాలా చోట్ల కథ, డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాలేదని టాక్.

34
జైలర్ ఫస్ట్ పార్ట్ లో మిస్ అయిన బాలకృష్ణ

కూలీ ఫ్లాప్‌తో, రజనీకాంత్ ఇప్పుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వస్తున్న 'జైలర్ 2' పైనే ఆశలు పెట్టుకున్నారు. 2023లో వచ్చిన ఫస్ట్ పార్టులో రజినీ రిటైర్డ్ జైలర్‌గా నటించారు. రమ్యకృష్ణ, వసంత్ రవి, మిర్ణా తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేశారు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా నటిస్తాడని ప్రచారం జరిగినా.. అందులో ఆయన నటించలేదు. ఈ సినిమా విడుదలై 650 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈసినిమాకు రెండో భాగం తీస్తున్నారు. 80% పైగా షూటింగ్ పూర్తయింది.. నెల రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నారట.

44
రజినీకాంత్ మూవీని రిజెక్ట్ చేసిన బాలకృష్ణ

ఈ క్రమంలోనే జైలర్ 2లో నటించడానికి బాలకృష్ణ నో చెప్పినట్టు టాక్ గట్టిగా నడుస్తోంది. రెండు నెలల క్రితమే 'జైలర్ 2'లో నటసింహం బాలకృష్ణను నటింపజేయడానికి చర్చలు జరిగాయట. కానీ రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని బాలకృష్ణ తిరస్కరించారని సమాచారం. కోట్లలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా ఆయన ఎందుకు నో చెప్పారనే దానిపై స్పష్టత లేదు. కానీ సోలో హీరోగా డబుల్ హ్యాట్రిక్ చేయాలని ప్రయ్నంలో ఉన్న బాలయ్య, గెస్ట్ రోల్స్ చేయకూడదని అనుకున్నట్టు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసి ఉంటాడు అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories