Bigg Boss 9 Telugu: నువ్వు అలిగితే ముద్ద పెట్టేది నేనే.. తనూజాకి సుమన్‌ శెట్టి ఝలక్‌.. 6వ వారం నామినేటైంది వీళ్లే

Published : Oct 13, 2025, 06:32 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఆరో వారం నామినేషన్లకి సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చింది. నామినేషన్‌ ప్రక్రియలో తనూజ, సుమన్‌ శెట్టి మధ్య, అలాగే రీతూ, రాము రాథోడ్‌ మధ్య వాదన ఆసక్తికరంగా సాగింది. 

PREV
15
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో హీటెక్కిన బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఐదో వారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ సెన్సేషన్‌ దివ్వెల మాధురీ, సోషల్‌ మీడియా సంచలనం రమ్య మోక్ష, టీవీ నటి ఆయేషా జీనత్‌తోపాటు నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌ గుప్తా, శ్రీనివాసా సాయి ఫైర్ స్టోర్మ్ అంటూ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వీరు రాకతో హౌజ్‌లో వాతావరణం మారిపోయింది. హౌజ్‌ మొత్తం హిటెక్కినట్టుగా ఉంది. దివ్వెల మాధురీ రావడం రావడంతోనే రచ్చ షురూ చేసింది. తనదైన పంచ్‌లు, సెటైర్లతో రెచ్చిపోతుంది. ఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీజకి, ఇప్పుడు కెప్టెన్‌ కళ్యాణ్‌కి ఆమె ఇచ్చిపడేసింది.

25
తనూజకి సుమన్‌ శెట్టి దిమ్మతిరిగే కౌంటర్‌

ఇక ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ హౌజ్‌ని హీటెక్కించింది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు, పాత వారి మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. వారితోనే నామినేషన్స్ చేయించి రచ్చ లేపారు.  వీక్‌నెస్‌లను, తప్పులను బయటపెడుతూ నామినేషన్ ప్రక్రియని గరంగరంగా మార్చేశారు. బిగ్‌ బాస్‌ ఇచ్చిన టాస్క్ ప్రకారం వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారు బాల్‌ని సంపాదించి, తమకు నచ్చిన కంటెస్టెంట్లని ఇచ్చే అవకాశం కల్పించారు. వాళ్లు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా మొదట నిఖిల్‌ నాయర్‌ బాల్‌ని సంపాదించి తనూజకి ఇచ్చారు. ఆమె సుమన్‌ని నామినేట్‌ చేసింది. `అందరితో కలిసిపోయి, మీకు మీరు ఇన్‌ వాల్వ్ అయితే బాగుంటుంద`ని తనూజ చెప్పగా, `ఎప్పుడు మీరు అలిగినా, ఏడ్చినా ఫస్ట్ వచ్చి మీకు ముద్దపెట్టేది నేనే` అని సుమన్‌ చెప్పడంతో తనూజకి దిమ్మతిరిగిపోయింది. ఆమె నోట నుంచి మరో మాట రాలేదు.

35
రాము రాథోడ్‌ని ఆడుకున్న తనూజ

ఆ తర్వాత రాము రాథోడ్‌ని నామినేషన్‌ చేసింది తనూజ. `సంజనా విషయంలో కూడా నువ్వు అందరిని అడగొచ్చు కదా` అని ఆమె వాదించగా, `మెడికల్‌ ఇష్యూ ఎవరికి మేజర్‌గా ఉందనేది చూస్తారు కదా` అని కౌంటర్‌ ఇచ్చాడు రాము. `అంటే నువ్వు డాక్టర్‌ వా` అంటే,   `నేను కెప్టెన్‌`ని అని రాము వేసిన పంచ్‌ అదిరిపోయింది. `నువ్వు ఒకరికి ఒకలాగా, మరొకరికి మరోలా చేస్తున్నావ`ని ఆమె ఆరోపించింది. దాన్ని రాము  సైలెంట్‌ అయ్యాడు. ఆ తర్వాత రమ్య మోక్ష ఆ బాల్‌ని దక్కించుకుని రాము రాథోడ్‌కి ఇచ్చింది. ఆయన రీతూ, పవన్‌లను నామినేట్‌ చేశాడు. `బిగ్‌ బాస్‌ క్లీయర్‌ కట్‌గా చెప్పాడు, కానీ ఫస్ట్ నేను పౌల్‌గా గమనించింది రీతూ అండ్‌ పవన్‌ లదే` అని రాము చెప్పగా, `బిగ్‌ బాస్‌ చెప్పిన తర్వాత నువ్వు పౌల్‌ గేమ్‌ అనడం కాదు` అని రీతూ అంటే, దానికి రాము వాదించాడు. దీంతో `అరేయ్‌ బాబు ఇది పౌల్‌ గేమ్‌ అన్నప్పుడు వీళ్లు డిస్‌ క్వాలిఫై అని గేమ్‌ని ఆపేయోచ్చుగా` అని వాదించింది రీతూ.

45
రాము రాథోడ్‌కి ఇచ్చిపడేసిన రీతూ

`మీ వల్లే గేమ్‌ రద్దు అయ్యింద`ని రాము రాథోడ్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు. దీనికి రీతూ కూడా రెచ్చిపోయింది. `నువ్వేం చేస్తున్నావ`ని ప్రశ్నించింది. దీనికి పవన్‌ని ఉద్దేశించి రాము చెబుతూ, నేను అనుకోలేదు.. నువ్వు కూడా రీతూతో ఇలా చేస్తావని అనగా, మధ్యలో కల్పించుకున్న రీతూ నువ్వు సంచాలక్‌గా పడుకున్నావని కౌంటర్‌ ఇవ్వడంతో అంతా షాక్‌ అయ్యారు. `నేను ఆయనతో మాట్లాడుతున్నా` అని రాము చెప్పగా, `నేను నీతోనే మాట్లాడతా` అని రీతూ చెప్పడం హౌజ్‌లో వాతావరణం హిటెక్కిపోయింది. తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటోంది. రచ్చ రచ్చగా అనిపిస్తోంది.

55
ఆరో వారం నామినేట్‌ అయిన సభ్యులు వీరే

అయితే లీక్‌ అయిన సమాచారం మేరకు ఆరో వారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్‌ అయ్యారు. వారిలో సుమన్‌ శెట్టి, రాము రాథోడ్‌, భరణి, డీమాన్‌ పవన్‌, దివ్య, తనూజ ఉన్నారు. మొత్తంగా బిగ్‌ బాస్‌ తెలుగు 9లో అసలు గేమ్‌ ఇప్పట్నుంచే ప్రారంభమైందని అర్థమవుతుంది. మరి ఇకపై షో వేరే లెవల్‌లో ఉంటుందా? మొదటి నుంచి హోస్ట్ నాగార్జున చెప్పినట్టు రణరంగంగా మారుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో పాత కంటెస్టెంట్లు భరణి, తనూజ, సుమన్‌ శెట్టి, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, దివ్య, సంజనా, కళ్యాణ్‌తోపాటు కొత్తగా వచ్చిన దివ్వెల మాధురీ, రమ్య మోక్ష, ఆయేషా జీనత్‌, నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌ గుప్తా, శ్రీనివాస సాయి ఉన్నారు. మళ్లీ 15 మంది కంటెస్టెంట్లు అయ్యారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories