తమ్ముడి తర్వాత అన్నతో రొమాన్స్.. చిరంజీవి మూవీలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు

Published : Oct 13, 2025, 03:01 PM IST

వాల్తేరు వీరయ్య విజయానంతరం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో మరో చిత్రానికి రంగం సిద్ధం అయింది. ఈ మూవీలో ఇద్దరు యంగ్ హీరోయిన్లు ఉండబోతున్నట్లు సమాచారం. 

PREV
15
చిరు, బాబీ కాంబోలో మరో మూవీ 

చిరంజీవి, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేర్ వీరయ్య చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ కాంబినేషన్ లో మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్నారు. దీనితో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

25
చిరంజీవికి జోడీగా రాశి ఖన్నా 

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న నటి రాశీ ఖన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. రాశీ ఖన్నా వయసు పరంగా చిరంజీవికి కంటే చాలా చిన్నదైనప్పటికీ, వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

35
మరో హీరోయిన్ కూడా

సినిమా యూనిట్ సమాచారం ప్రకారం, ఈ జంటను ఆకర్షణీయంగా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాశీ ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు చిరంజీవి ఎనర్జీ కలిస్తే ఈ పెయిర్ సిల్వర్ స్క్రీన్ పై ఫ్రెష్ నెస్ తీసుకువస్తుంది అని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నాతో పాటు మరో హీరోయిన్‌గా మాళవిక మోహనన్ పేరును కూడా పరిశీలిస్తున్నారని సమాచారం.

45
పవన్ తర్వాత చిరంజీవితో..

ఇద్దరు హీరోయిన్ల పాత్రలని డైరెక్టర్ బాబీ ప్రత్యేకంగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాశీ ఖన్నా.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. పవన్ మూవీ తర్వాత ఆమెకి చిరంజీవి చిత్రంలో ఛాన్స్ రావడం కూడా ఆసక్తికర విషయం. 

55
షూటింగ్ ఎప్పటి నుంచి అంటే.. 

మెగాస్టార్ చిరంజీవి కోసం బాబీ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను రూపొందించారని, ఇది ఆయన కెరీర్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశముందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. షూటింగ్ డిసెంబర్ 2025లో ప్రారంభమవుతుందని సమాచారం. చిత్రీకరణను వచ్చే దసరా నాటికి పూర్తి చేయాలని యూనిట్ ప్రణాళిక రూపొందిస్తోంది. పెద్ద స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories