suman, chiranjeevi
హీరో సుమన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి వారికి కాంపిటీషన్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే చిరంజీవికి పోటీ ఇచ్చిన హీరో సుమనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అందానికి అందం, నటనకు నటన, యాక్షన్ కి యాక్షన్ చేసి మెప్పించారు. ఒక్క డాన్సుల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ సుమన్ టాప్‌లో ఉన్నారు. ఆయన మూవీస్ కూడా అదే రేంజ్‌లో విజయాలు సాధించాయి. చిరంజీవికి పోటీనిచ్చాయి.
అయితే చిరంజీవికి డాన్సుల్లో పట్టు ఉండగా, సుమన్ అందగాడు. ఆ విషయంలో సుమన్ ముందు చిరు నిలవలేరు. ఇదే ఆయన అడ్వాంటేజ్. మహిళా ఆడియెన్స్ సుమన్‌ని బాగా ఇష్టపడేవారు. మాస్, క్లాస్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ సుమన్ వివాదాల్లో ఇరుక్కోవడంతో ఆయన కెరీర్ డ్యామేజ్ అయ్యింది.
అదే సమయంలో చిరంజీవి పోటీ లేకుండా ఎదిగిపోయారు. మెగాస్టార్ అయ్యారు. సుమన్ కేసు, వివాదాల నుంచి బయటపడ్డ తర్వాత మళ్లీ సినిమాలు చేసినా అప్పటి క్రేజ్ రాలేదు. విజయాలు సాధించినా, అంతటి ఊపు రాలేదు. దీంతో అదే ఛాన్స్ గా భావించి చిరంజీవి రెచ్చిపోయారు. మెగాస్టార్ సీట్‌పై కూర్చున్నారు.
suman, hero suman (photos source rtv interview)
ఇదిలా ఉంటే చిరంజీవి ఓ సందర్భంలో తాను కాదు, సుమనే మెగాస్టార్ అయ్యేవారు అని అన్నారట. ఈ విషయం సుమన్ వద్దకు వెళ్లింది. దీనిపై ఆయన స్పందించారు. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
అప్పట్లో చిరంజీవికి, తనకు మధ్య సినిమాలకు సంబంధించిన పోటీ నడించిందని ఒప్పుకున్నారు సుమన్. బాగా పోటీ ఉండేదని ఆయన చెప్పారు. అలాంటి సినిమాలు పడ్డాయి, జనం అలా ఆదరించారు. అయితే తాను మాత్రం ఎప్పుడూ పోటీగా భావించలేదన్నారు.
suman, hero suman (photos source rtv interview)
తనది సినిమా ఫ్యామిలీ కాదు, ఎలాంటి బాక్ గ్రౌండ్ లేదు. యాక్టింగ్ కూడా రాదు. సింపుల్‌గా సినిమాల్లోకి వచ్చాను, ఇక్కడికి వచ్చాకే యాక్టింగ్ నేర్చుకున్నా. కానీ హీరోగా ఎదిగాను. ఇదే నాకు పెద్ద అఛీవ్‌మెంట్. మళ్లీ కాంపిటీషన్ ఏంటి అనుకునేవాడిని. కానీ సినిమాలు విడుదల చేసినప్పుడు కలెక్షన్లు బాగా వచ్చేవి.
నాకు తెలియకుండానే నేను ఆయనకు కాంపిటీటర్ అయ్యాను. అది తెలిసి జరిగిందికాదు. అప్పటి వరకు చిరంజీవిలా డాన్సులు, ఫైట్లు చేసేవారు కాదు, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజుల జనరేషన్ అయిపోయింది. చిరంజీవి ఫ్రెష్‌గా వచ్చారు. ఊపేశారు.
ఆయనకు పోటీగా తన సినిమాలు కూడా ఆడటంతో జనం, ఇండస్ట్రీ పోటీగా భావించింది తప్పితే, తాను ఎప్పుడూ చిరంజీవికి పోటీ అని భావించలేదు. అసలు ఆ ఆలోచననే లేదని స్పష్టం చేశారు సుమన్. ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈవిసయాన్ని వెల్లడించారు.
read more: చిరంజీవి మూవీ ఫ్లాప్ అని భార్య ఫోన్, ఏడుస్తూ ట్యాంక్ బండ్ మీదికి వెళ్లిన డైరెక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
also read: సినిమాలతో సంబంధం లేకుండా త్వరలో ఎన్టీఆర్ భారీ ఈవెంట్, ఏదైనా సంచలనం ఉంటుందా ?