సినిమాలతో సంబంధం లేకుండా త్వరలో ఎన్టీఆర్ భారీ ఈవెంట్, ఏదైనా సంచలనం ఉంటుందా ?
సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ఈవెంట్స్ లో మాత్రమే ఫ్యాన్స్ ని మీట్ అవుతుంటారు. ఇటీవల కొన్నేళ్లుగా ఎన్టీఆర్ తన చిత్రాల ఈవెంట్స్ ద్వారా ఫ్యాన్స్ ని కలుసుకోవడం కుదర్లేదు.
సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ఈవెంట్స్ లో మాత్రమే ఫ్యాన్స్ ని మీట్ అవుతుంటారు. ఇటీవల కొన్నేళ్లుగా ఎన్టీఆర్ తన చిత్రాల ఈవెంట్స్ ద్వారా ఫ్యాన్స్ ని కలుసుకోవడం కుదర్లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లీ కొడుకులుగా నటించిన చిత్రం ఇది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన ఒక ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అయితే ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటనతో సినీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ కూడా మొదలైంది.
సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ఈవెంట్స్ లో మాత్రమే ఫ్యాన్స్ ని మీట్ అవుతుంటారు. ఇటీవల కొన్నేళ్లుగా ఎన్టీఆర్ తన చిత్రాల ఈవెంట్స్ ద్వారా ఫ్యాన్స్ ని కలుసుకోవడం కుదర్లేదు. దేవర చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.. కానీ ఇండోర్ ఈవెంట్ కావడంతో భారీగా అభిమానుల తాకిడి వల్ల అది రద్దయింది. ఇలా ఇతర హీరోల చిత్రాల ఈవెంట్స్ లో మాత్రమే ఎన్టీఆర్ అభిమానుల ముందుకు వస్తున్నారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సమ్మర్ వేదిక తగ్గాక త్వరలో అభిమానుల కోసం ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తానని తెలిపాడు. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అయితే ఇది సినిమాకి సంబంధించిన ఈవెంట్ అని ఎన్టీఆర్ చెప్పలేదు. కేవలం ఫ్యాన్స్ కోసమే పకడ్బందీగా ప్లానింగ్ చేసి ఈవెంట్ నిర్వహిస్తానని.. తద్వారా ఫ్యాన్స్ ని కలుసుకుంటానని ఎన్టీఆర్ తెలిపారు. తమిళనాడులో రజనీకాంత్, దళపతి విజయ్ ఇదే తరహాలో సినిమాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని మీట్ అయ్యేందుకు మాత్రమే చిన్నపాటి ఈవెంట్స్ నిర్వహిచడం చూస్తున్నాం.
ఇప్పుడు అదే స్ట్రాటజీని తారక్ ఫాలో అవుతున్నాడా అనే చర్చ మొదలైంది. సినిమా ఈవెంట్ కాకుండా.. సొంతంగా ఈవెంట్ ప్లాన్ చేసి ఫ్యాన్స్ ని కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ చుట్టూ రాజకీయాల గురించి కూడా తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది.
భవిష్యత్తులో ఎన్టీఆర్ నుంచి ఏదైనా సంచలన ప్రకటన ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. తాను నిర్వహించే ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఓపికతో ఎదురు చూడాలని.. నందమూరి ఫ్యాన్స్ అంటేనే సహనానికి మారుపేరు అని ఎన్టీఆర్ అన్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ స్వయంగా ఫ్యాన్స్ కోసం ఈవెంట్ నిర్వహించబోతుండడం టాలీవుడ్ లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర పరిణామం అని భావిస్తున్నారు.