ఆ తర్వాత యష్ ఇంటికి వస్తాడు. అప్పుడు వేద యష్ ని చూసి కూడా చూడనట్టు ఉంటుంది. అప్పుడు యస్ వేదాన్ని పిలవకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత యష్ తినడానికి అని వెళ్లగా అక్కడ ఏమీ లేకపోవడంతో నీళ్లు తాగుతాడు. అప్పుడు యస్ వెళ్లి సోఫాలో కూర్చోగా ఇంతలోనే ఖుషి, యష్ కోసం భోజనం తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఏంటి ఖుషి ఇంకా పడుకోలేదు అనడంతో అందరూ నీ మీద కోపంగా ఉన్నారు పడుకున్నారు మరి నీకు అన్నం ఎవరు పెడతారు అందుకే పడుకోలేదు నాన్న అని అంటుంది. అప్పుడు యష్ ఖుషి మాటలు విని ఎమోషనల్ అవుతాడు. అప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు అని యష్ ని నవ్విస్తుంది ఖుషి.