ఈ రోజు ఎపిసోడ్ లో జానకి దగ్గరగా రావడంతో అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు జానకి చూడు అఖిల్ అర్థం కి అపార్థం కి కేవలం ఒక్క అక్షరం మాత్రమే తేడా ఉంటుంది. అర్థం చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చు అపార్థం చేసుకుంటే సమస్యలు వస్తాయి. తప్పించుకోవడానికి దారులు వెతికే ముందు ఆలోచించే ఏదైనా పనిచేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి అనుకుంటుండగా అప్పుడు అఖిల్ నాకు ఈ సోదంతా ఎందుకురా అనుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒకటి ఆలోచించు ఇతని బిడ్డ జైల్లో ఉంటేనే ఒక తల్లి అంతగా తల్లి డిల్లి పోతే మరొకవైపు తన కూతురు కోమాలో ఉంటే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకో అఖిల్ అని అంటుంది.