Enneno janmala Bandham: అభికి పెళ్లి చూపులు చూస్తున్న భ్రమరాంబిక.. సంతోషంలో సులోచన మాలిని?

First Published Jan 20, 2023, 1:24 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో ఖుషి,వేద, యష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు పడుకుని నిద్రపోతుంది. ఇంతలోనే వేద, యష్ కలిసి ఇంటికి వస్తారు. అప్పుడు యష్ విలేజ్ మనం కలిసి దిగిన ఫొటోస్ ని తాతయ్య పంపించారు. నేను మీకు పంపించాను చాలా బాగున్నాయి కదా అని ఎంతో చాలా బాగున్నాయి. ఎందుకంటే అవి నిజం కాదు కదా అంటుంది వేద. అంటే ఏంటి అనడంతో ఖుషి అడగగానే నాకు చెప్పి చెప్పకుండా మీరు  నటించారు కదా అంటుంది. మంచి పర్ఫామెన్స్ బెస్ట్ సీఈవో నే కాదు బెస్ట్ యాక్టర్ కూడా అవుతారు సినిమాలలో యాక్ట్ చేయండి అంటుంది. ఇప్పుడు వేద బాధతో మాట్లాడుతుండగా అవి పొగడ్తలు అనుకునే సంతోష పడుతూ ఉంటాడు.
 

అప్పుడు వేద అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నువ్వు నాకు అర్థం అయినట్టే ఉంటావు కానీ అర్థం కావు అనుకుంటూ ఉంటాడు. ఆ తరువాత వేద,యష్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఖుషి పడుకొని ఉండడంతో ఖుషి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వేద,యష్ ఇద్దరు వెళ్లి పడుకుంటారు. ఇంతలోనే చిత్ర అక్కడికి వచ్చి పెద్దమ్మ కుషిని తీసుకుని రమ్మని చెప్పింది అక్క అని కుషిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేద యష్  ఇద్దరు ఎవరికి వారు ఏమి సంబంధం లేదు అన్నట్టుగా పడుకొని ఉంటారు. అప్పుడు వేద పడుకున్నావా అని యష్ అడగడంతో లేదు డాన్స్ చేస్తున్న అని వెటకారంగా సమాధానం చెబుతుంది. చాలా కోపంగా ఉన్నావు ఎవరి మీద అనడంతో ఉన్నారు లేండి ఖుషి వాళ్ళ ఫాదర్ అనడంతో నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అనగా వద్దులేండి చెప్తే బాగుండదు అని అంటుంది వేద.

పర్లేదు చెప్పు అనడంతో పెద్దపెద్ద బండరాళ్లు ఉంటాయి అవి మీకు పెద్దగా తేడా ఏమీ లేదు రెండు ఒకటే అనడంతో ఏంటి నేను బండరాయినా అంటాడు. నా దృష్టిలో భార్య గురించి పట్టించుకోని ప్రతి ఒక భర్త బండరాయితో సమానం అంటుంది వేద. అప్పుడు నేను నిన్ను ఏం పట్టించుకోలేదు అనడంతో పొద్దున నన్ను విసుగున్నావు కదా అనగానే నేను నిన్ను విసుగున్నానా అంటాడు. అదా మ్యాటరా మేడంగారు ఎందుకు చిరుబురులాడుతున్నారో నాకు అర్థం అయింది అని అంటాడు. అప్పుడు వేద చేసి ఇద్దరూ ఫన్నీగా పొట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరూ గతంలో జరిగిన విషయాలు మాట్లాడుకుంటూ ఇద్దరు ఎలక పిల్లిలా పోట్లాడుకుంటూ ఉంటారు. నైట్ 3 అవుతున్న పడుకోకుండా ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. 
 

తర్వాత ఇద్దరూ మంచంపై పడుకొని విలేజ్లో దిగిన ఫోటోలను చూసి మురిసిపోతూ ఉంటారు. ఆ ఫోటోలను ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఆ తరువాత మాళవిక టిఫిన్ చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి భ్రమరాంబికా వచ్చి కైలాష్ అన్న మాటలు గుర్తుతెచ్చుకుంటూ మాళవిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్లు యాక్ట్ చేస్తూ నిన్ను చూస్తే ఒళ్లంతా కంపరంగా ఉంది నీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మాళవిక వైపు చూస్తూ ఎప్పుడెప్పుడు నీ పీడ విరగడ అవుతుందా అని చూస్తున్నాను అనడంతో ఇంతలోనే అక్కడికి అభి వస్తాడు. ఎవరినీ అక్క అంతలా తిడుతున్నావు ఏం చేశారు అని అడగడంతో ఎవరినని ఏం లాభం అందరూ అలాగే ఉన్నారు అని అంటుంది.
 

చెప్పాల్సిన నిజాలు దాస్తున్నారు దాచాల్సిన ఆపద్దాలు చెబుతున్నారు అని అంటుంది. టాపిక్ డైవర్ట్ చేస్తూ నా ఫ్రెండ్ కొడుకుని ఒకతి అన్యాయం చేసి మోసం చేసి పెళ్లి చేసుకుంది ఆ విషయం గురించి మాట్లాడుతున్న అంటుంది భ్రమరాంబిక. అప్పుడు ఎగ్జాంపుల్ గా మిమ్మల్ని తీసుకొని మీరిద్దరూ ఎంత బాగా స్నేహంగా ఉన్నారు అనడంతో అభి మాళవిక ఒకరి వైపు కూడా చూసుకుంటూ ఉంటారు. చూడు మాళవిక నీకోసం అభి కోసం చెబుతున్నాను ఇద్దరూ వయసులో ఉన్న వారే బయట నలుగురు చూస్తే బాగుండదు నీ ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ చేసుకుని ఇకనుంచి వెళ్ళిపో అంటుంది భ్రమరాంబిక. లేదా నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పు సాల్వ్ చేస్తాను అని అంటుంది.

అభి కి సంబంధాలు చూస్తున్నాను వీలైనంత తొందరగా అభి కీ సంబంధం కుదరాలని దేవుడిని కోరుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కైలాస్ మేడం మీ ప్లాన్ ఎంటో అర్థం కావడం లేదు అనగా ఇప్పటిలో నీకు నా ప్లాన్స్ అర్థం కావులే కైలాష్ అని అంటుంది. అభి నా మాట వింటాడు ఇంట్లోంచి వెళ్లి పోవాల్సింది ఆ మాళవిక అనడంతో మేడం మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అంటాడు కైలాస్. ఆ తర్వాత వేద స్నానం చేసి తల తుడుచుకుంటూ అప్పుడు నిద్రపోతూ ఉంటాడు. తెల్లవారినా కూడా లేవకుండా అలాగే ఉంటాడు అనుకుంటూ ఉంటుంది వేద. ఆ తర్వాత సులోచన పంచదార కోసం అని రాగా ఏంటి అగ్రహారం వారు ఇలా పొద్దున్నే ఊడిపడ్డారు అనడంతో చక్కర కోసం వచ్చాను వదిన అని అంటుంది.
 

 దేనికైనా వచ్చావా అనడంతో దానికోసమే వచ్చాను వదిన అని అంటుంది. మరోవైపు వేద సెల్ఫోన్లో జోకులు చూసి నవ్వుకుంటూ ఉండగా అప్పుడు నిద్రలేచి వేద సెల్ ఫోన్ వైపు చూస్తుండగా వేద మాత్రం అటు ఇటు తిరుగుతూ నవ్వుతూ ఉంటుందే. ఇప్పుడు యష్ కూడా ఆ జోకులు చూసి నవ్వుకుంటూ ఉండగా వారిద్దరి నవ్వులు విన్న మాలిని సులోచన ఇద్దరూ సంతోషపడుతూ ఉంటారు. ఒకవైపు యష్,వేద మరోవైపు సులోచన మారిన ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు.

click me!