బంగారు మనసు చాటుకున్న కీర్తి సురేష్.. లక్షలు ఖర్చు చేసి ‘దసరా’ యూనిట్ కు బహుమతులు?

First Published | Jan 20, 2023, 12:46 PM IST

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ అయ్యింది. ఒక్కో చిత్రాన్ని పూర్తి చేసుకుంటూ వస్తోంది. తాజాగా ’దసరా‘ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. 
 

‘మహానటి‘ చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తి సురేశ్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా ఆరు చిత్రాలు ఉన్నాయి. ఒక్కో చిత్రాన్ని పూర్తి చేసుకుంటూ వస్తోంది.
 

రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ’దసరా‘ షూటింగ్ పూర్తైన విషయం తెలిసిందే. గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్రామీణ ప్రాంతంలో జరిగే ఈ కథ ఆసక్తిని పెంచుతోంది. 
 


అయితే షూటింగ్ పూర్తైన సందర్భంగా కీర్తి మంచి మనస్సు చాటుకుంది. Dasara చిత్ర యూనిట్ తో తనకు ఏర్పడిన బాండింగ్ తో  వారికి మరిచిపోలేని బహుమతులు అందించినట్టు తెలుస్తోంది. ఇందుకు లక్షల్లో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. 

Keerthy Suresh

దసరా చిత్రానికి పని చేసిన 130 మందికి కీర్తి 2 గ్రాముల గోల్డ్ ను బహూకరించినట్టు సమాచారం. ఆ బంగారం విలువ ప్రస్తుతం మార్కెట్ ప్రకారం.. దాదాపు 13 లక్షలకు పైనే ఉంటుందని తెలుస్తోంది. యూనిట్ కోసం ఇంత మొత్తంలో కీర్తి ఖర్చు చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

 శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. నాని ఊరమాస్ లుక్, కీర్తి సురేశ్ విలేజ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఇక కీర్తి ప్రస్తుతం`రివాల్వర్‌ రీటా` చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమిళంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లోనూ కీర్తి చిరుకు చెల్లిగా నటిస్తోంది. వీటితో పాటు తమిళంలో ‘మామ్నమ్’,‘సైరెన్’, ‘రఘు తాత’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

Latest Videos

click me!