మై డియర్... 14 ఏళ్ల వయసులో పరిచమయ్యావ్, నేను నిద్రలేచేది నీకోసమే, శ్రీజ సెన్సేషనల్ పోస్ట్!

Published : Jan 20, 2023, 01:17 PM ISTUpdated : Jan 20, 2023, 03:09 PM IST

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఆమె మై డియర్ అంటూ ఓ రొమాంటిక్ పోస్ట్ షేర్ చేశారు.   

PREV
17
మై డియర్... 14 ఏళ్ల వయసులో పరిచమయ్యావ్, నేను నిద్రలేచేది నీకోసమే, శ్రీజ సెన్సేషనల్ పోస్ట్!
Sreeja Konidela

శ్రీజ కొణిదెల భర్తతో విడిపోయారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారు. వీరి కుమార్తె నవిష్క తల్లి వద్ద ఉంటున్నారు. కోర్ట్ నవిష్క గార్డియన్షిప్ శ్రీజకు ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో కోర్టు అనుమతి మేరకు అప్పుడప్పుడు నవిష్కను కళ్యాణ్ దేవ్ కలుస్తున్నాడు.

27
Sreeja Konidela


చదువుకునే రోజుల్లో శ్రీజ తన క్లాస్ మేట్ ని ప్రేమించారు. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఆ వార్త సంచలనం రేపింది. శ్రీజ బాబాయ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నుండి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కొసమెరుపు. 
 

37
Sreeja Konidela

మొదటి భర్తతో విభేదాలు తలెత్తడంతో శ్రీజ విడాకులు తీసుకున్నారు. వారికి ఒక అమ్మాయి ఉన్నారు. 2016లో కళ్యాణ్ దేవ్ ని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి జన్మించారు. చిరంజీవి అల్లుడు హోదాలో కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మామయ్య హిట్ మూవీ టైటిల్ అరువు తీసుకొని విజేత చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 

47
Sreeja Konidela


కారణం తెలియదు కానీ 2021లో శ్రీజ-కళ్యాణ్ దేవ్ మధ్య గొడవలు జరిగాయి. శ్రీజ సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుండి భర్త పేరు తొలగించింది. అక్కడ విడాకుల రూమర్స్ కి బీజం పడింది. ఆపై శ్రీజ భర్తతో కలిసి కనిపించలేదు. కూతుళ్ళ బర్త్ డే వేడుకల్లో కళ్యాణ్ దేవ్ మిస్. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారన్న స్పష్టత వచ్చింది. 

57
Sreeja Konidela


ఇక శ్రీజ(Sreeja Konidela) మూడో వివాహం చేసుకుంటారనే కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె తాజా సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. నా ఒడిదుడుకుల్లో ప్రశాంతతవు, చీకటిలో వెలుగువు, 14 ఏళ్ల వయసులో నీతో అనుబంధం మొదలైంది. నేను నిద్ర లేస్తున్నానంటే నీ కోసమే... అని ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేసింది. 

67
Sreeja Konidela


ఎవరో ప్రియమైన వ్యక్తిని తలచుకుంటూ చెప్పినట్లున్న ఆ రొమాంటిక్ కామెంట్స్....  శ్రీజ కాఫీని ఉద్దేశించి చేశారు. కాఫీ అంటే శ్రీజకు ఎంతో ఇష్టమట. 14 ఏళ్ల వయసులో కాఫీ తనకు అలవాటైందట. అప్పటి నుండి కష్టనష్టాల్లో కాఫీ ఆమెకు తోడుగా ఉందట. నిద్రలేవగానే కాఫీ మొదటి సిఫ్ ఆమెకు గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పకనే చెప్పింది శ్రీజ. 

77
Sreeja Konidela


శ్రీజకు ఇద్దరు కూతుళ్లు. వారు ఆమె వద్దే పెరుగుతున్నారు. చిరంజీవి(Chiranjeevi) ప్రియమైన కూతురిగినా శ్రీజ ఉన్నారు. ఆయనకు చిన్న కూతురు అంటే చాలా ఇష్టమట. శ్రీజ అచ్చు నాన్న పోలికలతో ఉంటారు. ఇక పెద్ద కుమార్తె సుస్మిత చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. ఆమె నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories