షాకింగ్ న్యూస్... జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ టీం అవుట్.. కన్నీటి వీడ్కోలు చెప్పిన ముగ్గురు మిత్రులు

First Published Dec 7, 2021, 5:25 PM IST

జబర్దస్త్ లో సంచలనం చోటు చేసుకుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో టాప్ టీం గా కొనసాగుతున్న సుడిగాలి సుధీర్ కి బై బై చెప్పేశారు. ఇకపై జబర్దస్త్ షోలో కనిపించం అంటూ వేదిక సాక్షిగా స్పష్టత ఇచ్చారు. 

జబర్దస్త్ (Jabardasth)లో లుకలుకలు మొదలయ్యాయని, త్వరలో ఓ టాప్ టీం షో నుండి బయటికి వెళ్ళిపోతుందని కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి పుకార్లే వచ్చిన నేపథ్యంలో వీటిని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.

అయితే ఈ కథనాల్లో నిజం ఉందని తాజా ఎపిసోడ్ ప్రోమో చూస్తే అనిపిస్తుంది. ఈనెల 10 శుక్రవారం ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో కొద్దినిమిశాల క్రితం విడుదల చేశారు. ఈ ప్రోమో ఎప్పటిలాగే ఎంటర్టైనింగ్ గా సాగింది. సుడిగాలి సుధీర్ టీం డిఫరెంట్ గా ఓ స్కిట్ ట్రై చేశారు. 


లైవ్ షో కాకుండా రాకెట్ రాఘవ, హైపర్ ఆది నివాసాలకు వెళ్లి అక్కడ జరిగిన కామిక్ సన్నివేశాలతో కూడిన వీడియో షోలో ప్రసారం చేశారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో ప్రోమో చివర్లో ముగ్గురూ వేదికపైకి వచ్చి బాంబు పేల్చారు. ముందుగా గెటప్ శ్రీను జబర్దస్త్ నుండి వెళ్లి పోతున్నట్లు వెల్లడించారు. 


ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలని అనుకున్నాము.. అయితే స్టేజి పై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇన్నాళ్లు మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. మమల్ని క్షమించండి...  అంటూ రామ్ ప్రసాద్ ముగించారు. కాసేపు వేదికపై ముగ్గురు ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నారు. 

జబర్దస్త్ వేదిక ద్వారా ఫుల్ ఫేమస్ అయిన సుధీర్, గెటప్ శ్రీను (getup sreenu), రాంప్రసాద్ సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. సుధీర్ హీరోగా సినిమాలు చేస్తుండగా .. గెటప్ శ్రీను అనేక చిత్రాల్లో కామెడీ రోల్స్ చేస్తున్నారు.  రామ్ ప్రసాద్ సైతం పలు చిత్రాల్లో కనిపిస్తున్నారు. ఆయన రైటర్ గా కూడా అవకాశాలు దక్కించుకుంటున్నట్లు సమాచారం.  
 


జబర్దస్త్ షోతో వీరికి దాదాపు తొమ్మిదేళ్ల అనుబంధం ఉంది. వీరికి జబర్దస్త్ టాలెంట్ నిరూపించుకోవడానికి వేదిక ఇస్తే... ఆ జబర్దస్త్ కి వీరు తమ కామెడీ స్కిట్స్ ద్వారా పాపులారిటీ తెచ్చిపెట్టారు. ఎపిసోడ్ మొత్తంలో సుడిగాలి సుధీర్ టీం(Sudigali sudheer) హైలెట్ కామెడీ పంచుతుంది. 

మొదట్లో టిల్లు వేణు, ధనాధన్ ధన్రాజ్, రోలింగ్ రఘు వంటి కమెడియన్స్ టీం లీడర్స్ గా ఉండగా.. వీరు వాళ్ళ స్కిట్స్ లో కనిపించేవారు. సీనియర్స్ దూరం కావడంతో సుడిగాలి సుధీర్ టీం లీడర్ అయ్యారు. సుధీర్ టీం లోకి గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ రావడం చాలా ప్లస్ అయ్యింది. వీరి కాంబో సూపర్ హిట్ అయ్యింది. వీరి నిష్క్రమణ ఆ షోకి ఊహించని దెబ్బని చెప్పొచ్చు.

Also read Guppedantha Manasu: తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన రిషిని చూసి తట్టుకోలేకపోయిన దేవయాని!

Also read Karthika Deepam: పిల్లల కోసం ఆస్తులను త్యాగం చేసిన కార్తీక్.. స్థలం కొనడం కోసం ఏర్పాట్లు చేస్తున్న వంటలక్క!

click me!