వెడ్డింగ్ సీజన్స్‌లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అల్లు శిరీష్ స్టయిలీష్ రాయల్‌ లుక్స్ .. ఫోటోలు వైరల్‌

First Published Dec 7, 2021, 1:41 PM IST

తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది స్టైల్ ఐకాన్స్ ఉన్నారు. మన హీరోలు మోడల్స్‌కు ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఇంకా చెప్పాలంటే మోడలింగ్‌లో రప్ఫాడిస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోలు అయితే స్టైలింగ్ స్టేట్‌మెంట్స్ పాస్ చేస్తున్నారు. తాజాగా రాయల్‌ లుక్‌లో సందడి చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ, అల్లు శిరీష్‌, దుల్కర్‌ సల్మాన్‌. 

రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ, అల్లు హీరో అల్లు శిరీష్‌, `మహానటి` హీరో దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్‌తో రప్ఫాడిస్తున్నారు. అంతేకాదు వాళ్ల స్టైలింగ్ కూడా వైరల్ అవుతుంది. తాజాగా వెడ్డింగ్ సీజన్ నడుస్తుండటంతో స్టైలింగ్ ఐకాన్స్‌లా మారిపోయారు ఈ ముగ్గురు హీరోలు. తాజాగా బయటికి వచ్చిన వాళ్ల ఫోటోలు చూసి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. ఫ్యాన్స్ వాళ్లను చూసి ఫిదా అవ్వడమే కాదు.. అలాగే రెడీ అవ్వాలని కలలు కంటున్నారు. ఫాలో కూడా అవుతున్నారు. 

`అర్జున్‌ రెడ్డి`, `గీతగోవిందం` చిత్రాలతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయారు విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్‌గా పేరుతెచ్చుకున్న విజయ్ దేవరకొండ స్టైల్ కి ఐకాన్ గా నిలుస్తున్నారు. విజయ్‌ స్పెషల్ డిజైనర్ వేర్ వేసుకుంటే మాటలుండవు. తాజాగా వైట్ కుర్తా, వైట్ చుడిదార్ కాంబినేషన్‌లో పింక్ షర్వానిలో అదిరిపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇది నిజంగా గేమ్ ఛేంజర్ లుక్‌లా ఉంది. ఆయన ఫ్యాన్స్ కూడా ఈ లుక్ చూసి ఫిదా అవుతున్నారు. విజయ్‌లా స్టైల్ అప్ అవుతున్నారు.

తెలుగులో స్టయిలీష్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న హీరోల్లో అల్లు శిరీష్‌ కూడా ఉన్నారు. అన్నయ్య ఐకాన్‌ స్టార్‌ అడుగుజాడల్లో నడుస్తూ తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. తాజాగా అల్లు శిరీష్ అంతా తెలుపులో మెరిసిపోతున్నాడు. ముఖ్యంగా వైట్ చుడిదార్, దుప్పట్టా కాంబినేషన్‌లో వేసుకున్న వైట్ షర్వానీ పెళ్లికి పర్ఫెక్ట్ మ్యాచ్ అంతే. ఈ స్టైల్‌లో పెళ్ళికి వెళ్తే కచ్చితంగా అక్కడున్న అమ్మాయిలంతా మిమ్మల్నే చూస్తారేమో..? ఈ డ్రెస్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇంకా డీటైలింగ్ వెళ్తే గోల్డెన్ కప్స్, అలాగే కాలర్స్ కూడా గోల్డ్‌లోనే ఉన్నాయి. బ్రౌన్ కలర్ షూస్‌తో పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నాడు శిరీష్. ఈ పెళ్లి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిప్పుడు.

వీరితోపాటు మలయాళ స్టార్‌, `మహానటి` ఫేమ్‌ దుల్కర్ సల్మాన్ సైతం యూత్ స్టైల్ ఐకాన్స్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈయన వేసుకున్న వైట్ కలర్ చుడిదార్ కాంబినేషన్‌లో ఉన్న మెరూన్ కలర్ షర్వాని అదిరిపోయింది. దానికి గోల్డెన్ బటన్స్ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇది కూడా పర్ఫెక్ట్ వెడ్డింగ్ క్యాస్ట్యూమ్. ఈ డ్రెస్‌లో ప్రతీ చిన్న డిటైలింగ్ ఆకట్టుకుంటుంది. నీట్ కర్చీఫ్, గోల్డెన్ బటన్స్, ఐబాల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. 

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాతో రాబోతున్నారు. ఆయన పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `లైగర్‌` చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. వరల్డ్ పాపులర్‌ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

ఇక అల్లు హీరో అల్లు శిరీష్‌ డీసెంట్‌ సినిమాలతో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `ప్రేమ కాదంట` చిత్రంలో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయెల్‌ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 

`మహానటి` చిత్రంలో జెమినీ గణేషన్‌గా నటించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన ఇటీవల `కురుప్‌` సినిమాతో మెప్పించారు. తెలుగులో డైరెక్ట్ గా ఓ సినిమా కూడా చేస్తున్నారు. `యుద్ధంతో రాసిన ప్రేమ కథ` అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. వీటితోపాటు `హే సినామికా`, `సెల్యూట్‌`, హిందీలో `చుప్‌ః రివేంజ్‌ ఆఫ్‌ ది ఆర్టిస్ట్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

click me!