దేవుళ్లను అవమానించిన సుడిగాలి సుధీర్, మండిపడుతున్న హిందూ సంఘాలు, నెటిజన్లు, అసలేం జరిగింది.

Published : Apr 10, 2025, 12:12 PM ISTUpdated : Apr 10, 2025, 12:13 PM IST

ఈమధ్య సినిమా వివాదాల సంఖ్య పెరిగిపోతోంది. వెండితెరపైనే కాదు బుల్లితెరపై టీవీ స్టార్లు కూడా వివాదాస్పదం అవుతున్నారు. ఏదో ఒక విషయంలో అనవసరమైన విషయాలు కదిలించి.. ట్రోలింగ్ మెటీరియల్స్ గా మిగిలిపోతున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ విషయంలో అదే జరిగింది. ఓ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ చేసిన పని, హిందూ సంఘాలకు కోపం తెప్పించింది. దేవుళ్లపై జోకులేంటి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు భక్తులు. ఇంతకీ సుధీర్ ఏం చేశాడు? అంతలా వారికి కోపం వచ్చేలా చేసిన ఆ స్కిట్ ఏంటి? 

PREV
16
దేవుళ్లను అవమానించిన సుడిగాలి సుధీర్, మండిపడుతున్న హిందూ సంఘాలు, నెటిజన్లు, అసలేం జరిగింది.
pics-family stars promo

ఈమధ్య సినిమా వివాదాల సంఖ్య పెరిగిపోతోంది. వెండితెరపైనే కాదు బుల్లితెరపై టీవీ స్టార్లు కూడా వివాదాస్పదం అవుతున్నారు. ఏదో ఒక విషయంలో అనవసరమైన విషయాలు కదిలించి.. ట్రోలింగ్ మెటీరియల్స్ గా మిగిలిపోతున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ విషయంలో అదే జరిగింది. ఓ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ చేసిన పని, హిందూ సంఘాలకు కోపం తెప్పించింది. దేవుళ్లపై జోకులేంటి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు భక్తులు. ఇంతకీ సుధీర్ ఏం చేశాడు? అంతలా వారికి కోపం వచ్చేలా చేసిన ఆ స్కిట్ ఏంటి? 

Also Read: రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?
 

26
Pradeep Machiraju- Sudigali Sudheer

వెండితెరపై స్టార్ హీరోలకు ఉన్న ఇమేజ్.. బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు  ఉంది. ఆ ఇమేజ్ తో సినిమాల్లో స్టార్ గా మారాలని చూసిన సుధీర్ కు చుక్కెదురయ్యింది. ఆయన చేసిన ఏసినిమా హిట్ అవ్వలేదు. దాంతో మళ్లీ బుల్లితెరపైనే బిజీ అయ్యాడు సుధీర్.  కొన్నిషోలకు హోస్టింగ్ చేస్తున్నాడు. స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇక సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెజీషియన్ గా స్టార్ట్ అయ్యి.. జబర్థస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Also Read:  సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా

36

పేరు కమెడియన్ కాని  హీరోయిజం చూపిస్తూ.. రష్మితో రొమాన్స్ చేస్తూ..జబర్థస్త్ టీఆర్పీలు పెంచేశాడు సుధీర్. దాంతోఈ బుల్లితెర స్టార్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ వస్తున్నాడు సుధీర్. గతంలో సుధీర్ కొన్ని కాంట్రవర్సీలు పేస్ చేయగా.. నెటిజన్ల నుంచి ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే తాజాగా సుడిగాలి సుధీర్ చేసిన పనికి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నాయి. హిందూ దేవుళ్లను అవమానించాడంటూ సుధీర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ సుధీర్ ఏం చేశాడంటే?  

Also Read: థియేటర్ లో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? సినిమా మధ్యలో బ్రేక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే?

46

రీసెంట్ గా ఓ కొత్త షోలోజాయిన అయ్యాడు సుధీర్. ఈ షోలో యంకర్ రవితో పాటు పలువరు సెలబ్రిటీలు కూడా కనిపించారు. ఇందులో భాగంగా మాజీ హీరోయిన్ రంభ గెస్ట్ గా హాజరయ్యింది. అయితే రంభ ఎంట్రీ కోసం డిఫరెంట్ గా ప్లాన్ చేసిన టీమ్.. బావగారు బాగున్నారా సినిమాలో ఓ సీన్ ను రీమేక్ చేసి ఇందులో పెట్టారు. ఆసినిమాలో చిరంజీవి నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలని అనుకుంటే హీరోయిన్ రంభ కనిపంచి షాక్ ఇస్తుంది. అదే సీన్ ను ఈ షోలో పెట్టారు. సుధీర్ నంది కొమ్ముల మధ్య నుంచి దేవుడిని చూస్తే.. రంభ ఎంట్రీ కనిపిస్తుంది. 

Also Read: ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?

56
rambha

ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దేవుడిని ఇలా అవమానిస్తారా  అంటు సుధీర్ ను విమర్శిస్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. సోషల్ మీడియా లో కూడా నెటిజెన్స్ మండిపడుతున్నారు.

నందీశ్వరుడు కొమ్ముల వైపు నుండి చూస్తే కేవలం శివుడు మాత్రమే కనిపించాలి, మీకు ఇష్టమొచ్చినట్టు మార్చేసుకొని హీరోయిన్ కనిపించడం ఏమిటి?, అసలు ఎంటర్టైన్మెంట్ షో కి నందీశ్వరుడు బొమ్మని తీసుకొని వచ్చి ఇలాంటి వాటికి వాడుకోవడం ఏమిటి?, హిందూ దేవుళ్ళు అంటే కామెడీ అయిపోయిందా మీకు అంటూ విరుచుకుపడుతున్నారు.  

Also Read:  రజనీకాంత్ భార్య లత నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

66

మరి ఈ విషయంలో సుధీర్ ఏలా స్పందిస్తాడో చూడాలి. కొంత మంది సుధీర్ ప్యాన్స్ మాత్రం చిరంజీవి సీన్ నే కదా అతను చేసింది. అందులో తప్పేముంది. మెగాస్టార్ చేసినప్పుడు లేని తప్పు ఇప్పుడు వచ్చిందా అంటున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories