mohanbabu: మోహన్‌బాబుకు కోర్టులో ఎదురుదెబ్బ.. కోర్ట్ క్లర్క్‌ గుట్టు బయటపెట్టిన మనోజ్‌!

Published : Apr 10, 2025, 11:22 AM IST

Mohan Babu: ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌  కోర్డు షాకిచ్చింది. గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో అతని చిన్న కుమారుడు మంచు మనోజ్‌కు ఊరట లభించింది. ఇక నిన్నంతా జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి ఎదుట మనోజ్‌ బైటాయించి ధర్నా చేసిన సంగతి తెలిసిందే. మోహన్‌బాబు రీసెంట్‌గా మనోజ్‌ తన ఇంటికి రావడానికి వీలులేదని కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో మనోజ్‌ని బుధవారం ఆయన ఇంటికి వెళ్లేందుకు అక్కడి సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో అతను ఏం చేశాడంటే..   

PREV
15
mohanbabu: మోహన్‌బాబుకు కోర్టులో ఎదురుదెబ్బ.. కోర్ట్ క్లర్క్‌ గుట్టు బయటపెట్టిన మనోజ్‌!

మనోజ్‌ ఇటీవల రాజస్థాన్‌ వెళ్లిన సమయంలో తన ఇంట్లోకి విష్ణు మనుషులు ప్రవేశించి.. పలు వస్తువులు, కార్లను దొంగిలించారని ఆరోపణలు చేస్తున్నాడు. ఈ విషయం తన తండ్రి, తల్లికి చెప్పేందుకు కూడా అవకాశం లేకుండా విష్ణు చేస్తున్నాడని మనోజ్‌ ఆరోపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తన కేసు విషయంలో న్యాయస్థానాలను విష్ణు తప్పుడు ఆధారాలు చూసి తప్పుదోవపట్టిస్తున్నారని మనోజ్‌ నిన్న బహిరంగంగానే చెప్పారు. ఫేక్‌ పత్రాలతో కోర్టులను మేనేజ్‌ చేస్తున్నారన్నారు. ఇక తన వద్ద కూడా ఆధారాలు ఉన్నాయని వాటిని కూడా కోర్టులు పరిశీలించాలని మనోజ్‌ వేడుకున్నాడు. 

25

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ కోర్టులో మోహన్‌బాబుకు జల్‌పల్లిలోని ఇంటి సంబంధించిన వివాదంపై దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చింది. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ.. నిన్న ఎల్బీ నగర్ కోర్టు ఆ తీర్పును కొట్టివేయడం గమనార్హం. దీంతో మంచు వారి పంచాయతీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 

35
All about the filmy Manchu Manoj-Mohan Babu feud

జలపల్లిలోని ఒక ఇంటికి సంబంధించిన ఆస్తి తగాదా విషయంలో గతంలో కోర్టును ఆశ్రయించిన మోహన్‌బాబుకు అతని వాదనలను అంగీకరించి, మోహన్‌బాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే... ఈ కేసుకు సంబంధించి కొత్త సాక్ష్యాలు, ఆధారాలు మనోజ్‌ బయటపెట్టడంతో కేసు మళ్లీ విచారణకు వచ్చింది.

45
Mohan Babu

మోహన్ బాబు గతంలో కోర్టుకు సమర్పించిన పత్రాలు సరైనవి కాదని, మనోజ్ కొన్ని కీలక ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. తన తండ్రి తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాదులు కోర్టులను కూడ పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. అయితే.. తాను వాస్తవాలను, తన వద్ద ఉన్న ఆధారాలను కోర్టు ముందు ఉంచినట్లు మనోజ్‌ చెబుతున్నారు. వీటిని పరిశీలించిన ఎల్బీ నగర్ కోర్టు గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టేసింది. దీని ప్రకారం మనోజ్‌ ఏదో బలమైన ఆధారాలను కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ తీర్పుతో మోహన్ బాబుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. 

 

55
Mohan Babu house


మోహన్‌బాబు కేసు తొలి నుంచి సినిమాను తలపించేలా ట్విస్టుల మీద ట్టిస్టులు అన్నట్లు నడుస్తోంది. నిన్న అతని కేసును కోర్టు కొట్టివేయగా.. ఆధారాలను చూపడంలో తప్పిదం చేసిన ఎల్‌బీ నగర్‌ కోర్టు అక్కడ పనిచేసే క్లర్క్‌పై చర్యలకు ఆదేశించడం గమనార్హం. అయితే.. మోహన్‌బాబు కేసు వివరాలు నమోదు చేయడంలో పొరపాట్లు చేసినందుకు క్లర్క్‌కు న్యాయమూర్తి మెమో జారీ చేశారు. మోహన్‌బాబు న్యాయవాదులు ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ఇక ముందు ఏది జరిగినా ఎదుర్కొనేలా, మనోజ్‌ బలమైన ఆధారాలు సేకరించుకుని పెట్టుకుంటున్నారని సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories