ఎపిసోడ్ ప్రారంభంలో పిల్లలకి ట్రీట్ చేసిన డాక్టర్ వీళ్ళకి మామూలు జ్వరమే సిరప్ రాస్తాను అది పట్టండి. రెండు గంటలు అబ్జర్వేషన్ లో ఉండండి ఆ తర్వాత తీసుకెళ్ళిపోదురు గాని అంటాడు. అలాగే అంటూ అను వాళ్ళు అక్కడినుంచి అబ్జర్వేషన్ రూమ్ లోకి వెళ్తుంటే మరొక డాక్టర్ చూసి అనుని గుర్తుపట్టి జెండే కి ఫోన్ చేస్తాడు. మేము వెంటనే వచ్చేస్తాము మేము వచ్చేవరకు ఆమెని అక్కడ నుంచి కదలనివ్వకండి హోల్డ్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.