చాలాకాలం తర్వాత దర్శకుడు తేజ ఆమెకు మరో ఆఫర్ ఇచ్చాడు. లేటెస్ట్ రిలీజ్ అహింసలో సదా లాయర్ రోల్ చేశారు.. అహింస మూవీ నిరాశపరిచినా సదా పాత్రకు ప్రశంసలు దక్కాయి. అలాగే స్టార్ మాలో ప్రసారమైన బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షోలో సదా జడ్జిగా వ్యవహరించింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి బీబీ జోడీలో పాల్గొన్నారు. సీనియర్ హీరోయిన్ రాధిక, తరుణ్ మాస్టర్ తో పాటు జడ్జి సీటు పంచుకున్నారు.